"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబరు 24 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము తిథి : ద్వాదశి ఉ. 06గం౹౹34ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : ఆదివారము (భానువారం) నక్షత్రం : కృత్తిక రా. 09గం౹౹39ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం : సిద్ధ ఉ. 07గం౹౹18ని౹౹ వరకు తదుపరి సాధ్య కరణం : కౌలవ సా. 06గం౹౹07ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹45ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 09గం౹౹53ని౹౹ నుండి 11గం౹౹27ని౹౹ వరకు అమృతకాలం : రా. 07గం౹౹17ని౹౹ నుండి 08గం౹౹51ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹30ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹27ని౹౹కు ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈరోజు ఉ.6గం.30నిల లోపు చెయ్యాలి. గురుబోధ హేమంతఋతువులో మెుదటిమాసం అయిన మార్గశీర్షంలో నందవ్రజమైన బృందావనంలోని కుమారీమణులు, నేతితో తయారుచేసిన దైవప్రసాదం ఆహారంగా స్వీకరిస్తూ, కృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసారు. ఈ వ్రతం చేసిన వారికి అభీష్టాలు నెరవేరతాయని శ్రీకృష్ణుడు గోపికలతో స్వయంగా చెప్పాడు. ఇంతటి మహావ్రతాన్ని మార్గశీర్షం మనకు అందించింది. గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారు. శ్లో|| హేమంతే ప్రథమే మాసి, నందవ్రజ కుమారికాః| చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చన వ్రతమ్||