Dec 19 2023డిసెంబరు 19 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 19 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము

తిథి : సప్తమి  సా. 04గం౹౹06ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : పూర్వాభాద్ర రా. 03గం౹09ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : సిద్ధి రా. 06గం౹౹38ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  వణిజ మ. 01గం౹౹06ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹22ని౹౹ వరకు & రా. 10గం౹౹36ని౹౹ నుండి 11గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹47ని౹౹ నుండి 12గం౹౹16ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹43ని౹౹ నుండి 09గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹25ని౹౹కు

గురుబోధ
మానవులై పుట్టాక ఏదో ఒక ఋణం మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఋణ సంబంధమైన విముక్తి అంత తేలిక కాదు. అందునా ధనసంబంధమైన ఋణాలు మానవులని బాగా పట్టి పీడిస్తుంటాయి. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తు బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది. 

కుజగ్రహ వృత్తాంతం👇


పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.

expand_less