"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబరు 16 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము తిథి : చతుర్థి రా. 10గం౹౹57ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం : ఉత్తరాషాఢ ఉ. 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి శ్రవణం యోగం : ధ్రువ ఉ. 07గం౹౹03ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : వణిజ ఉ. 09గం౹౹15ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹25ని౹౹ నుండి 07గం౹౹53ని౹౹ వరకు వర్జ్యం : మ. 01గం౹౹17ని౹౹ నుండి 02గం౹౹47ని౹౹ వరకు అమృతకాలం : రా. 10గం౹౹19ని౹౹ నుండి 11గం౹౹49ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹24ని౹౹కు గురుబోధ ప్రపంచ ప్రళయకాలంలో నాశనం కానిది కాశి. అనేక కోట్ల బ్రహ్మండాలకి నాథుడు విశ్వనాథుడే. కొన్నికోట్ల జన్మల మహాపుణ్యఫలం ఉంటే తప్ప కాశీ వెళ్ళలేము, కాశీలో ఉండలేము. శ్లోకం- అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం | ఇతి బ్రువాణస్సతతం కాశీవాస ఫలం లభేత్ || నేను కాశీకి వెళుతున్నాను అక్కడే ఉంటాను అని మనస్సులో సదా ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారు కాశీవాసం చేసిన ఫలితాన్ని పొందుతారు - శ్రీ కాశీ ఖండం, శ్రీ స్కాందపురాణము పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.