Dec 11 2023డిసెంబరు 11 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 11 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్దశి  12వ తేదీ  తె. 05గం౹౹41ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : విశాఖ ఉ. 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : సుకర్మ రా. 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :  వణిజ ఉ. 07గం౹౹10ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹15ని౹౹ నుండి 12గం౹౹59ని౹౹ వరకు & మ. 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు 
వర్జ్యం : సా. 03గం౹౹40ని౹౹ నుండి 05గం౹౹18ని౹౹ వరకు
అమృతకాలం : రా. 01గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹24ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹23ని౹౹కు

🕉️ కార్తిక సోమవారం, మాసశివరాత్రి🕉️

గురుబోధ
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క  పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం. చెట్లు, తీగలు మొదలైన వాటిని స్థావరలింగాలు అంటారు. వీటికి నీరు పోసి పోషిస్తే శివుని స్థావరలింగపూజగా శివుడు భావిస్తాడు. కాబట్టి శివభక్తులు వీటిని పోషించాలి. పక్షులు, జంతువులు జంగమాలు అనబడతాయి. వీటిని రక్షించి పోషిస్తే శివుని జంగమలింగపూజ అవుతుంది. కాబట్టి వీటిని కూడా పోషించి రక్షించాలి. ఈ మొత్తం పూజను ప్రకృతిపూజగా అనగా అమ్మవారి పూజగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇది నిజమైన శివపూజ. శివాలయం తుడిచినవాడు, కడిగి శుభ్రం చేసినవాడు, శివుడి కోసం పూలతోట పెంచి, అందులోని పూలను శివునకు అర్పించినవాడు శివపదం పొందుతాడు. బ్రతికినంతకాలం సంపదలు పొందుతాడు. 

సతీదేవి శ్రీరాముడిని పరీక్షించుట👇


expand_less