"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 09 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : ద్వాదశి తె. 05గం౹౹15ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : చిత్త ఉ. 09గం౹౹14ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : శోభన రా. 11గం౹౹37ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం : కౌలవ రా. 06గం౹౹57ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹22ని౹౹ నుండి 07గం౹౹48ని౹౹ వరకు
వర్జ్యం : మ. 03గం౹౹10ని౹౹ నుండి 04గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : రా. 01గం౹౹19ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹22ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹22ని౹౹కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు ఉదయం చేయాలి.
గురుబోధ
కొంతమందికి చిన్నప్పటి నుంచి జ్ఞాపకశక్తి ఉండదు. కొంతమందికి క్రమక్రమంగా వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇది భయంకరమైన లక్షణం. వార్ధక్యం వల్ల మతి పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. చెంబుడు పాలతో, బిందెడు పాలతో లేక పంచపాత్రలో పోసిన పాలతో పంచదార కలిపి సన్నని ధారతో అభిషేకించాలి. అభిషేకించగా వచ్చిన ధారను ఒక పాత్రలో పట్టుకుని పూజ అయిపోయాక తీర్ధంగా తీసుకుంటే అలాంటివాడికి మళ్ళీ మంచి తెలివితేటలు పెరుగుతాయి. మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పూర్వం ఎంత చురుకైన బుద్ధి ఉన్నదో, ఎటువంటి జ్ఞాపకశక్తి ఉన్నదో ఆ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చేస్తుంది.
సతీ కల్యాణం - 2👇