"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 08 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : ఏకాదశి తె. 04గం౹౹08ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : హస్త ఉ. 07గం౹౹22ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం : సౌభాగ్య రా. 12గం౹౹05ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం : బవ సా. 05గం౹౹33ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹17ని౹౹ వరకు మ. 12గం౹౹14ని౹౹ నుండి 12గం౹౹58ని౹౹ వరకు
వర్జ్యం : మ. 03గం౹౹59ని౹౹ నుండి 05గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹20ని౹౹ నుండి 04గం౹౹03ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹20ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹కు
🕉️ కార్తిక కృష్ణ ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం చేయాలి.
గురుబోధ
ఏకాదశి అంటే హరిహరులకి ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. అది కూడా కార్తికమాసంలో వచ్చే రెండు ఏకాదశుల్లో తెల్లవారుజామున లేచి నదుల్లో కానీ, కాలువల్లో కానీ, ఎక్కడైనా స్నానం చేసి విష్ణు ఆలయం, లేక శివాలయంకి వెళ్లి యథాశక్తి అర్చన చెయ్యాలి. తులసీదళాలతో హరిని, బిల్వదళాల తో హరుడిని అర్చన చేసి ఉపవాసం ఉండి రాత్రికి నక్తభోజనం కానీ లేక సంపూర్ణ ఉపవాసం కానీ ఉండి భగవంతుని కథలు వింటూ భగవత్ ధ్యానం చేసిన వాడు జీవితంలో యమకింకరుల దర్శనం చేయడు. నరకానికి వెళ్ళడు. సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు ఒక వెయ్యి ఎనిమిది తులసీ దళాలు, బిల్వపత్రాలతో శివుడ్ని పూజించిన వాడు ఐశ్వర్యం పొందుతాడు. చామంతి పువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవి పొందుతాడు. ఏకాదశి రోజున జాగరణ చేసి మరుసటి రోజు హరి దర్శనం చేసుకున్నవాడికి జీవితంలో సుఖం, శాంతి, ఆనందం తప్ప మాటవరసకి కూడా దౌర్భాగ్యం పొందడు.
సతీ కల్యాణం👇
శ్రీ వాసుదేవ శత నామాలు👇