"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 03 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : షష్ఠి రా. 06గం౹౹21ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : ఆశ్లేష రా. 09గం౹౹22ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం : ఐంద్ర రా. 08గం౹౹56ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం : వణిజ రా. 07గం౹౹27ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 03గం౹౹54ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹03ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹35ని౹౹ నుండి 09గం౹౹21ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹18ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు
గురుబోధ
రుద్రాక్షను ధరించడంతోటే మహాపాతకాలు నశించిపోతాయి. పదకొండు వందల రుద్రాక్షలను ధరించినవాడు. రుద్రస్వరూపుడౌతాడు. అన్ని రుద్రాక్షలు ధరించినవాడు పొందే ఫలితాలను వర్ణించడం ఎవరివల్లాకాదు. ఐదువందల రుద్రాక్షలతో ఒక కిరీటాన్ని తయారుచేసి, దానిని శిరస్సున ధరించినవాడు శివభక్తులలో అగ్రగణ్యుడౌతాడు. రుద్రాక్షలు ధరించి, శివనామ జపం చేసేవాడు శివునితో సమానుడు. అటువంటివానిని చూచినవారికి కూడా పాపాలు నశించిపోతాయి. రుద్రాక్షలు ఒక్కసారి మంత్రపూర్వకంగా ధరిస్తే చాలు. అవి శరీరంలో అవయవాలుగా మారిపోయినట్లే. ఇక వాటిని తీయరాదు. రుద్రాక్షలను ఇక పొరపాటున కూడా తీయరాదు. రుద్రాక్షలను తీసి పారవేసే వారు నరకం పొందుతారు.
ప్రదక్షిణ మహిమ👇
భాగవత సప్తాహాలు ఎందుకు చేయించుకోవాలి👇