Nov 29 2023నవంబరు 29 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 29 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము

తిథి : విదియ  మ. 01గం౹౹36ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : మృగశిర మ. 02గం౹౹28ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం : సాధ్య రా. 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం :  గరజి మ. 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹25ని౹౹ నుండి 12గం౹౹09ని౹౹ వరకు
వర్జ్యం : రా. 11గం౹౹14ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹05ని౹౹ నుండి ఉ. 07గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹16ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు


గురుబోధ
శివనామం గంగ. 
విభూతి యమునానది. 
రుద్రాక్ష సర్వపాపనాశినియైన సరస్వతి. 
అందుకే ఈ మూడూ ధరించి, త్రివేణీసంగమమై భక్తుడు ఇహపరాలు రెండూ సాధించగలడు. బ్రహ్మ మూడు నదుల సంగమాన్నీ, ఈ మూడు పనుల సంగమాన్నీ పోల్చి, కొలిచి రెండూ కూడా, సమాన ఫలితాలు అని తేల్చి చెప్పాడు. అందుకే త్రిమూర్తులు కూడా, శివనామ, విభూతి, రుద్రాక్ష ధారణలు తప్పక చేస్తుంటారు. శివనామం దావాగ్ని వంటిది. మహాపాపారణ్యాలను దగ్ధం చేస్తుంది. జీవులు ఈ జన్మలో దుఃఖాలు పొందడానికి గల కారణం ఇంతకు పూర్వం చేసిన పాపాలు. పాపాలు తొలగనిదే దుఃఖాలు తొలగవు. 
దుఃఖాలు తొలగడానికి శివనామస్మరణ సరియైన మార్గం. శివనామం నిరంతరం జపించేవాడు, పండితుడు, వైదికుడు, పుణ్యాత్ముడు, ధన్యుడు. శివనామం తొలగించగలిగేటన్ని పాపాలను భూలోకంలోని మానవులంతా కలిసినా చేయలేరు. 

గుణనిధి కథ-1👇


expand_less