November 11 2023నవంబరు 11 2023favorite_bordershare
"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 11 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము
తిథి : త్రయోదశి మ. 12గం౹౹50ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : చిత్త రా. 01గం౹౹48ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : ప్రీతి సా. 04గం౹౹59ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం : వణిజ మ. 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹25ని౹౹ నుండి 07గం౹౹35ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 08గం౹౹37ని౹౹ నుండి 10గం౹౹20ని౹౹ వరకు
అమృతకాలం : రా. 06గం౹౹55ని౹౹ నుండి 08గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹06ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹25ని౹౹కు
🕉️ శనిత్రయోదశి, దివోదాస జయంతి(కాశీ ఖండం) ,మాసశివరాత్రి, ధన్వంతరీ జయంతి, నరకచతుర్దశి🕉️ శని త్రయోదశి నాడు శివార్చన, అభిషేకం వల్ల శివానుగ్రహం విశేషముగా పొందగలము. నరక చతుర్దశి నాడు శ్రీ కృష్ణ పూజ, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి.
దీపావళీ అమావాస్య నాడు సూర్యోదయమునకు ముందే తప్పక అభ్యంగన స్నానం ఆచరించాలి.
గురుబోధ
దీపమునకు స్వచ్ఛమైన ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం శ్రేష్ఠం. వాసన వచ్చే నూనె, నెయ్యి లేదా రసాయనాలు కలిపిన నూనెలతో 100 దీపములు వెలిగించినా పెద్ద ఫలితం ఉండదు. అదే శ్రేష్ఠమైన నూనె లేదా నెయ్యి తో ఒక్క దీపం వెలిగించినా అనంతపుణ్యం లభిస్తుంది.
కనకధారాస్తోత్రం👇
సంధ్యాకృతశివస్తోత్రం👇
శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)👇
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం👇
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial