Nov 08 2023నవంబరు 08 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 08 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : దశమి  ఈ రోజు ఉదయం 07గం౹౹29ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : పుబ్బ రా. 07గం౹౹20ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : ఐంద్ర సా. 04గం౹౹11ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం :  విష్టి ఉ. 08గం౹౹23ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం : తె.03గం౹౹16ని౹౹ నుండి 05గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹15ని౹౹ నుండి 02గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹04ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹27ని౹౹కు

గురుబోధ: 
సత్యహరిశ్చంద్రుడు తాను సత్యం పలకడానికి కారణం సకల పాపాలను హరించే సరయూనదీ స్నానం అని చెప్పాడు. హరిశ్చంద్రుడు శరీరముతో స్వర్గానికి వెళుతుంటే ఇంద్రాది దేవతలు నువ్వు శరీరంతో స్వర్గానికి రావడానికి గల కారణం ఏమిటి అని అడగగా అప్పుడు హరిశ్చంద్రుడు ఇదంతా నా తపః శక్తి, గొప్పతనము, సత్యం పలకడం వల్ల వచ్చాను అని చెప్పలేదు. సరయూనదిలో నిత్యము స్నానం చేయడం వలన, పరమ పవిత్రమైన అయోధ్యానగరంలో ఉండడం వలన, అటు నది మరియు ఇటు నగరము నాకు ఈ స్థాయిని, సత్యం పలికే శక్తిని ఇచ్చాయి అని చెప్పాడు.

expand_less