Oct 30 2023అక్టోబరు 30 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : విదియ రా. 11గం౹౹18ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : భరణి ఉ. 06గం౹౹17ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : వ్యతీపాత సా. 05గం౹౹33ని౹౹వరకు తదుపరి వరీయాన్
కరణం :  తైతుల ఉ. 11గం౹౹03ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు & మ. 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం : రా. 06గం౹౹08ని౹౹ నుండి 07గం౹౹43ని౹౹ వరకు
అమృతకాలం : తె. 03గం౹౹37ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹01ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹31ని౹౹కు

గురుబోధ - గురుబోధ
ప్రతి సంవత్సరము పితృతర్పణములు 96 పర్వదినములలో ఇవ్వడం మంచిదని ధర్మశాస్త్రం. దానినే షణ్ణవతి శ్రాద్ధం లేదా తర్పణ పుణ్యకాలం అంటారు. అవి 12 అమావాస్యలు, 12 సంక్రమణలు, 14 మన్వంతరములు, 4 ఉగాదులు (కృత, త్రేత, ద్వాపర, కలి ఉగాదులు) - మాఘ అమావాస్య, భాద్రపద కృష్ణ త్రయోదశి, వైశాఖ శుక్ల తృతీయ, కార్తిక శుక్ల నవమి), వైధృతి కరణములు - 13
వ్యతీపాత యోగములు - 13, మహాలయ పక్షములు, అష్టక శ్రాద్ధములు (మార్గశీర్షం,  పుష్యం, మాఘం , ఫాల్గునం  - బహుళ (కృష్ణ) పక్షం సప్తమి, అష్టమి, నవమి) వంటి పర్వదినములలో చేయడం వలన పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.

పితృదేవతా స్తోత్రం👇


శ్రీ శివ కేశవ అష్టోత్తరం👇


expand_less