"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 22 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము
తిథి : అష్టమి రా. 05గం౹౹25ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ రా. 05గం౹౹17ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : ధృతి రా. 09గం౹౹53ని౹౹వరకు తదుపరి శూల
కరణం : విష్టి ఉ. 08గం౹౹58ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹03ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు
వర్జ్యం : రా. 09గం౹౹02ని౹౹ నుండి 10గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹12ని౹౹ నుండి 12గం౹౹43ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹36ని౹౹కు
🕉️ దుర్గాష్టమి - దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ దుర్గాదేవి అలంకారం🕉️
గురుబోధ శ్రీ దుర్గాష్టోత్తర శతనామపారాయణం వలన : 1) అష్టకష్టాల్లో నుండి బయటపడతారు. 2) అష్టైశ్వర్యాలను పొందుతారు. 3) దీనిని నిరంతరం పారాయణం చేస్తే ఆత్మబలం, జ్ఞానం పెరుగుతాయి. 4) పనులు చెయ్యడానికి కావలసిన శక్తి లభిస్తుంది. 5) ఈ నామాలను శుచిగా ఉండి భక్తిశ్రద్ధలతో ఎప్పుడైనా పారాయణం చేసుకోవచ్చు. కానీ, అష్టమి, నవమి, చతుర్దశి అనే మూడు తిథులూ అమ్మవారికి చాలా ఇష్టం. అటువంటి పవిత్రకాలాల్లో చేస్తే తిరుగులేని అద్భుతఫలితం లభిస్తుంది.
అష్టమీ తిథి జగన్మాతకు, ఈశ్వరునికి కూడా ప్రీతికరమైనది. అందునా నవరాత్రులలో కాలభైరవునికి కూడా ప్రీతికరమైన అష్టమీ తిథి ఆదివారం నాడు రావడం శుభకరం. ఈరోజు చేసే జప,దాన,హోమాలు, స్తోత్ర పారాయణములు, పురాణశ్రవణాలు మరింత విశేషఫలితాలనిస్తాయి.
శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి👇శ్రీ అర్జునకృత దుర్గా స్తోత్రం👇