Oct 10 2023అక్టోబరు 10 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 10 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము

తిథి : ఏకాదశి మ. 03గం౹౹09ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : ఆశ్లేష ఉ. 07గం౹౹04ని౹౹ వరకు తదుపరి మఖ
యోగం : సాధ్య ఉ. 07గం౹౹47ని౹౹వరకు తదుపరి శుభ
కరణం :  బాలవ మ. 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు 
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు & రా. 10గం౹౹32ని౹౹ నుండి 11గం౹౹21ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹22ని౹౹ నుండి 10గం౹౹08ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 05గం౹౹33ని౹౹ నుండి 07గం౹03ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹55ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹56ని౹౹కు

🕉️ ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణ 11వ తేదీ ఉదయం చేయాలి.

గురుబోధ
 'అజ' ఏకాదశి " - భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో ఏకాదశికి  'అజ' ఏకాదశి అని పేరు. జన్మరాహిత్యం కలిగించేది కనుక  అది ఏకాదశి అన్నారు. ఈ ఏకాదశీ వ్రతం శ్రద్ధాసక్తులుతో ఆచరిస్తే, ఆ వ్యక్తికి జీవితంలో కష్టములు రావు. జీవితంలో ఏ విధమైన అశాంతి ఉండదు. ప్రశాంతత లభిస్తుంది.

శ్రీ వాసుదేవ శత నామాలు👇


పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw
expand_less