"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబరు 05 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : షష్ఠి ఉ. 08గం౹౹52ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : మృగశిర రా. 11గం౹౹19ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర యోగం : వరీయాన్ 6వ తేదీ తె. 05గం౹౹23ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : విష్టి సా. 06గం౹౹02ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹52ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మ. 02గం౹౹39ని౹౹ నుండి 03గం౹౹26ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹37ని౹౹ నుండి 06గం౹౹07ని౹౹ వరకు అమృతకాలం : మ. 02గం౹౹13ని౹౹ నుండి 03గం౹52ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹54ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹49ని౹౹కు గురుబోధ ప్రతి సంవత్సరము పితృతర్పణములు 96 పర్వదినములలో ఇవ్వడం మంచిదని ధర్మశాస్త్రం. దానినే షణ్ణవతి శ్రాద్ధం లేదా తర్పణ పుణ్యకాలం అంటారు. అవి 12 అమావాస్యలు, 12 సంక్రమణలు, 14 మన్వంతరములు, 4 ఉగాదులు (కృత, త్రేత, ద్వాపర, కలి ఉగాదులు) - మాఘ అమావాస్య, భాద్రపద కృష్ణ త్రయోదశి, వైశాఖ శుక్ల తృతీయ, కార్తిక శుక్ల నవమి), వైధృతి కరణములు - 13 వ్యతీపాత యోగములు - 13, మహాలయ పక్షములు, అష్టక శ్రాద్ధములు (మార్గశీర్షం, పుష్యం, మాఘం , ఫాల్గునం - బహుళ (కృష్ణ) పక్షం సప్తమి, అష్టమి, నవమి) వంటి పర్వదినములలో చేయడం వలన పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పితృదేవతా స్తోత్రం👇 https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw