Oct 01 2023అక్టోబరు 01 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 01 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము

తిథి : విదియ మ. 12గం౹౹14ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : అశ్విని రా. 11గం౹౹00ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం : వ్యాఘాత మ. 01గం౹౹14ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం :  గరజి ఉ. 09గం౹౹41ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹17ని౹౹ నుండి 05గం౹౹05ని౹౹ వరకు
వర్జ్యం : రా. 07గం౹౹10ని౹౹ నుండి 08గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం : సా. 04గం౹౹05ని౹౹ నుండి 05గం౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹53ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹కు



గురుబోధ
భాద్రపద మాసంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఉండే 15 రోజులను మహాలయపక్షము లేదా పితృ పక్షం అంటారు ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయాశ్రాద్ధంతో సమానము.
ఒకే ఇంటి పేరు ఉన్న వారిని భోక్తగా పిలువరాదు. సగోత్రీకులని పిలువవచ్చు. ఒక్క యోగి లేదా పురాణజ్ఞుడు, పండితుడు భోక్తగా వస్తే అక్షయ ఫలితం వస్తుంది.


expand_less