"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబరు 28 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము తిథి : చతుర్దశి రా. 06గం౹౹23ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : పూర్వాభాద్ర రా. 02గం౹౹44ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం : గండ రా. 11గం౹౹55ని౹౹ వరకు తదుపరి వృద్ధి కరణం : గరజి ఉ. 08గం౹౹33ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹41ని౹౹ వరకు & మ. 02గం౹౹41ని౹౹ నుండి 03గం౹౹29ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 10గం౹౹19ని౹౹ నుండి 11గం౹౹48ని౹౹ వరకు అమృతకాలం : రా. 07గం౹౹16ని౹౹ నుండి 08గం౹౹45ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹కు 🕉️ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం - భాద్రపద శుక్లచతుర్దశి 🕉️ గురుబోధ 1) శ్రీ మహావిష్ణువు అనంతపద్మనాభుడు అనే పేరుతో శయనించారు. అదే రూపం ఇప్పటికి కూడా వివిధ ఆలయాల్లో కనబడుతోంది. 2) ఈ రోజు విష్ణువును, విష్ణుసహస్రనామంతో కాని లేదా అష్టోత్తర శతనామములతో కాని పూజించడం సర్వశుభకరం. 3) దానధర్మాలు మనకి తోచినట్లుగా చేసుకోవచ్చు.