Sep 25 2023సెప్టెంబరు 25 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 25 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి రా. 01గం౹౹40ని౹౹ వరకు తదుపరి  ద్వాదశి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ ఉ. 09గం౹౹17ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : అతిగండ మ. 02గం౹౹33ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :  గరజి ఉ. 07గం౹౹55ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹17ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు & మ 02గం౹౹42ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు
వర్జ్యం : మ. 01గం౹౹03ని౹౹ నుండి 02గం౹౹33ని౹౹ వరకు
అమృతకాలం : రా. 10గం౹౹00ని౹౹ నుండి 11గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹53ని౹౹కు

🕉️ పద్మనాభ ఏకాదశి 🕉️

👉🏻🕉️ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (26వ తేదీ మంగళవారం) ఉదయం చేయవచ్చును.

గురుబోధ
1) భాద్రపద శుక్ల ఏకాదశిని పద్మనాభ ఏకాదశి అంటారు. ఇది భద్రములు కలిగిస్తుంది. 
2) ఈ పద్మనాభ ఏకాదశి ఉపవాస దీక్ష మహాఫలితం వల్ల ఏడు జన్మములలో చేసిన పాపాలు తొలగిపోతాయి. దేవతలు సంతోషిస్తారు.
3) అనావృష్టి తొలగాలంటే, వర్షములు సకాలంలో కురవాలంటే, రోగములు తొలగాలంటే ఈ ఉపవాస దీక్ష చేస్తే తొలగిపోతాయి సంతృప్తి రావాలంటే కూడా ఈ ఏకాదశీ ఉపవాసవ్రతం చేసి భక్తితో ఆ భగవంతుడిని ప్రార్థిస్తే మనశ్శాంతి కలుగుతుంది.

L
expand_less