Sep 12 2023సెప్టెంబరు 12 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 12 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి రా. 02గం౹౹01ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : ఆశ్లేష రా. 12గం౹01ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం : శివ రా. 01గం౹౹12ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  గరజి మ. 01గం౹౹06ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రా. 10గం౹౹46ని౹౹ నుండి 11గం౹౹33ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 11గం౹౹38ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : రా. 10గం౹౹14ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹50ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹03ని౹౹కు


గురుబోధ
అగస్త్యమహర్షిని రాత్రి పడుకొనే ముందు తలుచుకొని పడుకొంటే దుస్స్వప్నాలు రావు. అపమృత్యుభయం ఉండదు, యమభయం ఉండదు. అగస్త్యుడు దక్షిణం దిక్కున నిలబడి రాత్రిపూట యమభయం, మృత్యుభయం లేకుండా చేస్తాడు. పూర్వం కొత్తగా వాహనములు తీసుకొన్నప్పుడు అగస్త్యమహర్షిని తలుచుకొని, ప్రదక్షిణ చేసి అందులో ప్రయాణం చేసేవారు. ఇంటిలో నుండి బయటకు ప్రయాణమై వెళ్లేటప్పుడు అగస్త్యమహర్షికి నమస్కారము చేసుకొని (ముమ్మారు అగస్త్యం నమామి అనుకొని) ప్రయాణానికి వెళితే అటువంటి వారికి యాక్సిడెంట్ భయం ఉండదు.

expand_less