Sep 09 2023సెప్టెంబరు 09 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 09 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : దశమి రా. 09గం౹౹00ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : ఆరుద్ర సా. 05గం౹24ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : వ్యతీపాత రా. 09గం౹౹06ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం :  విష్టి సా. 05గం౹౹47ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹50ని౹౹ నుండి 07గం౹౹27ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : ఉ. 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹50ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు

🕉 వ్యతీపాత యోగం, శ్రావణ శనివారం, దశమి 🕉

పితృదేవతా స్తోత్రం👇


శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం)👇


గురుబోధ
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు. ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.

expand_less