" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 సెప్టెంబరు 08 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము
తిథి : నవమి రా. 08గం౹౹10ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : మృగశిర సా. 04గం౹01ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం : సిద్ధి రా. 08గం౹౹37ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం : గరజి సా. 04గం౹౹00ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం : రా. 12గం౹౹53ని౹౹ నుండి 02గం౹౹34ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 06గం౹౹52ని౹౹ నుండి 08గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹50ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు
🕉 శ్రావణ శుక్రవారం 🕉
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 👇ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇గురుబోధ
శ్రావణమాసం ఎంతో విశేషమైన మాసము. ఈ మాసంలో మంగళగౌరీ పూజలు , లక్ష్మీదేవి పూజలను విశేషంగా చేస్తారు. శ్రావణం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లోకాలని ఉద్ధరించడానికి క్షీరసాగరం నుండి అవతరించిందని పురాణకథలు చెపుతున్నాయి. అందుకే శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరమహాలక్ష్మీ వ్రతం చేస్తారు. ఏదైనా అనివార్యకారణం చేత ఆ శుక్రవారం చేయడం కుదరకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఈ వ్రతం చేసుకోవచ్చు.