" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 19 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము తిథి : తదియ రా. 07గం౹౹32ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : ఉత్తర రా. 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : సిద్ధ రా. 09గం౹౹19ని౹౹ వరకు తదుపరి సాధ్య కరణం : తైతుల ఉ. 09గం౹౹11ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : తె. 04గం౹౹57ని౹౹ నుండి 07గం౹౹27ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹39ని౹౹ వరకు అమృతకాలం : సా. 04గం౹౹28ని౹౹ నుండి 06గం౹౹13ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹46ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹21ని౹౹కు గురుబోధ శ్రావణ శుక్ల చతుర్థి శ్రావణమాసం శుక్లపక్షంలో మధ్యాహ్నం వరకు చతుర్థి ఉంటే ఆ రోజున గణపతిని గరికతో పూజించాలి. ఈ వ్రతాన్ని దూర్వాగణపతి వ్రతం అంటారు. ఆలయంలో అయితే విగ్రహాలను, ఇంట్లో అయితే హరిద్రా గణపతిని, లేదా ఆర్క గణపతిని, లేదా శిలా విగ్రహములను పూజించాలి. ఈ వ్రతం అత్యంత శుభప్రదం.