" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 17 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : త్రయోదశి రా. 10గం౹౹11ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : రేవతి ఉ. 07గం౹౹55ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : ఆయుష్మాన్ రా. 09గం౹౹18ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : గరజి ఉ. 10గం౹౹59ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹31ని౹౹ నుండి 12గం౹౹23ని౹౹ వరకు వర్జ్యం : తె. 03గం౹౹08ని౹౹ నుండి 04గం౹౹40ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 05గం౹౹36ని౹౹ నుండి 07గం౹౹08ని౹౹ వరకు & రా. 12గం౹౹03ని౹౹ నుండి 01గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹31ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹20ని౹౹కు గురుబోధ తొండం కుడివైపుకు తిరిగి ఉన్న గణపతిని పూజిస్తే జ్ఞానం, ముక్తి లభిస్తుంది. ఎడమవైపుకి తిరిగి ఉన్న గణపతిని పూజిస్తే ఈ లోకంలో ఉన్న కోరికలు తీరుతాయి. అందుకే జ్ఞానులు రెండు రకాల విగ్రహాలను పూజిస్తారు. భుక్తి ముక్తి రెండూ కావాలనుకునేవారు రెండు రకాల విగ్రహాలను పూజించాలి. గణపతికి చాలా శ్లోకాలు ఉన్నాయి. అందులో శివపురాణంలో ప్రత్యేకంగా "అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే!!" అనే శ్లోకాన్ని చెప్పారు. "దేవదేవ జగన్నాథా లోకానుగ్రహకారకా! ఏకదంత ఉమాపుత్రా నమస్యేహం జగద్గురో" ఈ శ్లోకం కూడా శివపురాణంలో గణేశఖండంలో ఉంది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ ఉదయం నలభై రోజులపాటు పారాయణ చేస్తే అనేక రకాల అభివృద్ధి కలుగుతుంది. అలాగే "సుముఖశ్చైక దంతశ్చ" అనే గణపతి పదహారు నామాలను రోజూ చదివితే అన్నిటా విజయం లభిస్తుంది.