" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 16 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : ద్వాదశి రా. 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ. 08గం౹౹50ని౹౹ వరకు తదుపరి రేవతి యోగం : ప్రీతి రా. 11గం౹౹16ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : కౌలవ మ. 12గం౹౹17ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹57ని౹౹ వరకు & రా. 10గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹32ని౹౹ వరకు వర్జ్యం : రా. 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹54ని౹౹ వరకు అమృతకాలం : తె. 04గం౹౹19ని౹౹ నుండి 05గం౹౹49ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹32ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹20ని౹౹కు ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈరోజు చెయ్యాలి. గురుబోధ శ్రీ మద్ధేవీభాగవతము నవమస్కంధంలో ఉన్న ఈ ద్వాదశనామమంత్రములను నిత్యం లేదా పర్వదినములలో పఠిస్తే నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయని ఫలశ్రుతి. నాగదేవతా నామములు : 1. ఓం జరత్కారు ప్రియాయై నమః 2. ఓం జగద్గౌర్యై నమః 3. ఓం సిద్ధయోగిన్యై నమః 4. ఓం నాగభగిన్యై నమః 5. ఓం నాగేశ్వర్యై నమః 6. ఓం విషహరాయై నమః 7. ఓం జగత్కారవే నమః 8. ఓం మనసాయై నమః 9. ఓం వైష్ణవ్యై నమః 10. ఓం శైవ్యై నమః 11. ఓం ఆస్తీకమాత్రే నమః 12. ఓం మహాజ్ఞానయుతాయై నమః