April 27 2023ఏప్రిల్ 27 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 27 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షము

తిథి : సప్తమి ఉ. 12గం౹౹58ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : పునర్వసు ఉదయం 06గం౹౹40ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : ధృతి ఉ. 08గం౹౹48ని౹౹ వరకు తదుపరి శూల
కరణం :  వణిజ మ. 01గం౹౹38ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹53ని౹౹ నుండి మ. 10గం౹౹43ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి. 02గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹10ని౹౹ నుండి 06గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹41ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹14ని౹౹కు

🕉️గంగామాత అవతరణము, శ్రీ భగీరథ జయంతి, వైశాఖ సప్తమి, శర్కరాసప్తమి, నర్మదానదిలో గంగామాత ప్రవేశిస్తుంది (శ్రీ స్కాందపురాణము)🕉️


గురుబోధ
వైశాఖశుక్లసప్తమీ తిథినాడు, జహ్నుమహర్షి గంగాదేవిని కుడిచెవి నుండి విడిచిపెట్టాడు. ఈ రోజు నర్మదా నదిలో గంగ ప్రవేశిస్తుంది. ఈ తిథినాడు పంచదారతో చేసిన పిండివంటలు సూర్యునికి నివేదిస్తే, సకల దుఃఖాలు నశిస్తాయి. పుత్రసంతానం కలుగుతుంది.

expand_less