April 21 2023ఏప్రిల్ 21 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 21 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షము

తిథి : పాడ్యమి ఉ. 08గం౹౹47ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : భరణి రా. 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి కృత్తిక  
యోగం : ప్రీతి ఉ. 09గం౹౹30ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  బవ ఉ. 06గం౹౹58ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మ. 12గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹01ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు
అమృతకాలం : రా. 06గం౹౹37ని౹౹ నుండి 08గం౹౹13ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹44ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹12ని౹౹కు

👉🕉️గంగానదీ పుష్కరాలు ప్రారంభం🕉️👈

గురుబోధ
నిత్యం గంగా స్మరణ చేసుకోవడం వల్ల పాపము దరిచేరదు. అంత్యకాలంలో కాశీ గంగ దగ్గర శరీరం విడిచిపెట్టే భాగ్యం కలుగుతుంది.  'గంగ' 'గంగ' 'గంగ' అని నీళ్లను తాగేప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు స్మరించుకోవడం వల్ల గంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఈ శ్లోకం తప్పక నిత్యం స్మరించాలి. 
నందినీ నిళినీ సీతా మాలినీ చ మహాపగా
విఘ్ణపాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ

వైశాఖమాసాన్ని మాధవమాసం అని అంటారు. తెల్లవారుజామున వామన నామస్మరణతో నిద్రలేచినచో మనస్సుకి చురుకుదనం వస్తుంది. సాధ్యమైనంతవరకు చన్నీటి స్నానం మంచిది. ఎవరికైనా మామిడిపండుతో భోజనం పెడితే ఉత్తమ జన్మప్రాప్తి, తాటి ఆకు విసనకఱ్ఱ దానం చేస్తే శరీరం విడిచాక స్వర్గంలో ఇంద్రుడు కల్పవృక్షంలో నుండి ఒక పండు ఇస్తాడు. శయ్యాదానం వల్ల భవిష్యత్తు జన్మల్లో భార్యాభర్తలకి ఎడబాటురాదు. ఈ మాసంలో వామనావతార, క్షీరసాగరమధన ఘట్టాలు వినాలి, హనుమంతుడ్ని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. 

expand_less