" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 06 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : పూర్ణిమ ఉ. 09గం౹౹51ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : హస్త మ. 12గం౹౹39ని౹౹ వరకు వరకు తదుపరి చిత్త యోగం : వ్యాఘాత (7వ తేదీ) రా. 01గం౹౹02ని౹౹ వరకు తదుపరి హర్షణ కరణం : బవ ఉ. 08గం౹౹34ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు & మ. 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు వర్జ్యం : రా. 08గం౹౹57ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 06గం౹౹18ని౹౹ నుండి 08గం౹౹00ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹54ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు 🕉️ హనుమద్విజయోత్సవం, చైత్ర పూర్ణిమ,రౌచ్యమన్వాది, ఛత్రపతి శివాజీ మాహారాజ్ నిర్యాణం🕉️ గురుబోధ సదా రామ రామేతి రామామృతం తే | సదా రామమానందనిష్యందకందం || పిబంతం సమంతం హసంతం సుదంతం | హనూమంతం అంతర్భజే తం నితాంతం || "ఎల్లవేళలా రామనామాన్ని గ్రోలుతూ, నమస్సులు అర్పిస్తూ, తద్వారా పెల్లుబికిన ఆ ఆనందంతో స్వచ్ఛమైన తన దంతముల కాంతిని నలు దిశలా వ్యాపింప జేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, రామ నామమే శ్వాసగా జీవించే హనుమంతుణ్ణి నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను" శ్రీ ఆది శంకరాచార్యులవారు రచించిన శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని ఈ శ్లోకంతో హనుమంతుని స్తుతించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.