" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము
తిథి : నవమి రా. 11గం౹౹52ని౹౹ వరకు తదుపరి దశమివారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : పునర్వసు రా. 11గం౹౹30ని౹౹ వరకు తదుపరి పుష్యమియోగం : అతిగండ (31వ తేదీ) రా. 01గం౹౹03ని౹౹ వరకు తదుపరి సుకర్మకరణం : బాలవ ఉ. 10గం౹౹17ని౹౹ వరకు తదుపరి కౌలవరాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹01ని౹౹ నుండి 10గం౹౹53ని౹౹ వరకు & మ. 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹19ని౹౹ నుండి 12గం౹౹04ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹02ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు
🕉️👉శ్రీ రామనవమి👈🕉️
గురుబోధ
◆ చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామనవమి - శ్రీరాముడు కౌసల్యా దశరథులకు & జగన్మాత పార్వతీదేవి మేనా హిమవంతులకు జన్మించిన పవిత్ర తిథి. - శ్రీ శివ మహాపురాణం
◆ ఇదే రోజు1608 వ సం౹౹ రాణుబాయికి, సూర్యాజీపంతునకు శ్రీ సమర్థ రామదాస స్వామి జన్మించారు. వీరే ఛత్రపతి శివాజీ మహరాజ్ కి గురువులు. వీరు రచించిన "దాసబోధ" శివాజీ మహరాజ్ గారికి నిత్యపారాయణ గ్రంథం. సమర్థ రామదాస స్వామి వారిని హనుమద్ అవతారం గా కీర్తిస్తారు.
◆శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో శ్రీ రామవతారం 7వది.ఈ రోజు చేయవలసిన కొన్ని ముఖ్యమైనవి:1) శ్రీ రామచంద్రప్రభువుని యథాశక్తి శ్రీసూక్తం, పురుషసూక్తంతో అర్చన ; 2) శ్రీ రామునికి అష్టోత్తరశతనామావళితో పూజ ; 3) శ్రీ రాముని తులసీదళాలతో అర్చించడం, రామనామజపం ; 4) శ్రీ రామరక్షాస్తోత్రం లేదా సంక్షిప్త రామాయణం పారాయణం ; 5) ఆలయదర్శనం, గురువులకి నమస్కారములు, గుడిలో ప్రదక్షిణలు