హనుమాన్ జన్మ తిధి సందర్భంగా వ్యాస రచన పోటీలు
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
జయశ్రీరామ
పూజ్య గురుదంపతులకు జయము జయము.
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
రామదూత, వాయు పుత్రుడు, అంజనా సుతుడు, రుద్రవీర్య సముద్భవుడు అయిన హనుమ విశేషాలను, మహిమను వేదవ్యాసుని తండ్రి పరాశరుల వారు విశేషంగా వర్ణించారు. వాటినే పూజ్య గురుదేవులు తమ ప్రవచనామృతం ద్వారా మనకు అందించారు.
పూజ్య గురుదేవులు ప్రవచించిన శ్రీ ఆంజనేయం నుండి వ్యాస రచన పోటీలు.
Registration Start Date: March 15th, 2023
Registration End Date: April 25th, 2023
వ్యాస రచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది. కావున భక్తులందరూ తమ యొక్క భక్తిని, భావాలను తాము ఎంచుకున్న అంశం ద్వారా స్వామివారి లీలలు వర్ణిస్తూ చాటవచ్చును.
అభ్యర్థులు వారి విభాగంలో ఇవ్వబడిన అంశాన్ని వారి మాటలలో వ్యాసం వ్రాయవలసి ఉంటంది. తరువాత గూగుల్ ఫారం (form)లో వారి వివివరాలను, వారు వ్రాసిన వ్యాసాన్ని స్కాన్ (scan) చేసి, దాన్ని పిడీయఫ్ ఫార్మాట్ (PDF format) లో భద్రపరచి (save చేసి), ఫారం లో అప్లోడ్ (upload) చేసి సబ్మిట్ (submit) చేయాలి.
అభ్యర్థులందరి నుండి వ్యాసం స్వీకరించిన తరువాత న్యాయనిర్ణేతలు వాటి మూల్యాoకనం పూర్తి చేస్తారు .
మూల్యంకనం ప్రకారం ప్రతి విభాగం నండి విజేతలను ప్రకటిస్తాము.
పోటీలకు సంబంధించిన వయో వర్గము, 4 వయో వర్గాలుగా అభ్యర్థులను విభజిస్తున్నాం.
విభాగం-వయస్సు:
ప్రథమ వర్గము : 7 -16 సంవత్సరముల వయస్సు.
ద్వితీయవర్గము: 17-25సంవత్సరముల వయస్సు.
తృతీయ వర్గము : 26-40 సంవత్సరముల వయస్సు.
చతుర్ధ వర్గము : 41 సంవత్సరములు మరియు ఆ పై వయస్సు కలవారు.
వయో వర్గం వారిగా వ్యాసరచన పోటీ అంశాలు :
వయస్సును బట్టి ఆలోచన ఉంటంది. హనుమ తత్త్వం వయస్సు పెరిగేకొద్దీ పరిపక్వం పొందుతుంది అందుకే అవిఅన్నీ పరిగణంచి వివిధ వయో వర్గం వారికి శ్రీ గురుదేవులు ప్రవచించిన శ్రీఆంజనేయం నుండి అంశాలను ఎంపిక చేశాము . అభ్యర్థులు వారి వయో వర్గంలో ఇవ్వబడిన అంశాన్ని తీసుకొని వ్యాస రచన పోటీల్లో పాల్గొనవచ్చు.
వ్యాస రచన పోటీల అంశాలు:
ప్రథమవర్గము : (7-16 years )
రుద్రవీర్య సమద్భవుడిగా హనుమ జన్మ రహస్యం.
ద్వితీయ వర్గం (17-25 years)
జీవాత్మ పరమాత్మ అనుసంధానానికి గురువు యొక్క ప్రాముఖ్యత.
తృతీయ వర్గం (26-40)
హనుమ - రావణ సంవాదం.
చతుర్థ వర్గం (41+years పై వారందరికీ )
సుందరకాండ పారాయణ మహత్యం.
వ్యాస రచన నియమాలు
1) వ్యాసాన్ని పూర్తిగా తెలుగు లో వ్రాయవలసి ఉంటంది.
2) మీ వయోవిభాగంలో ఇవ్వబడిన అంశాన్ని మాత్రమే వ్యాసరచన చేయవలసి ఉంటుంది.
3) వ్యాసము A4 Size paper పైన Blue (or) Black Ball Pen ఉపయోగించి మాత్రమే వ్రాయవలసి ఉంటంది. పది (10) సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే పెన్సిల్ ఉపయోగించవచ్చు.
4) మీరు ఇచ్చిన అంశం గురించి మొత్తం తెలుసుకొని పూర్తిగా మీ మాటల్లోనే వ్రాయాలి.
5) వ్యాసాన్నిప్రారంభించటానికి ముందు కాగితం పైన మీ పూర్తి పేరు, ఊరు , మీవయోవిభాగం, మీరు ఇచ్చిన అంశం యొక్క వివరాలను నింపిన తర్వాత వ్యాసాన్నివ్రాయవల్సి ఉంటుంది (నమూనా పత్రము ఈ PDF ఆఖరులో జతచేయబడినది గమనించగలరు ).
6) క్రింద ఇవ్వబడిన నాలుగు విషయాలను కచ్చితంగా ప్రస్తావించి వ్యాస రచన చేయాలి.
అ) ఉపోద్ఘాతము లేదా ప్రస్తావన
ఆ) విషయ వివరణ
ఇ) జీవితాన్వయము లేదా నీతి
ఈ) ముగింపు
7) మీ వ్యాసం కనీసం 3 కాగితాలు ఉండాలి, గరిష్ఠంగా 6 కాగితాలు మించి వ్రాయకూడదు (A4 సైజు పేపర్).
8) క్రింద ఇవ్వబడిన విధంగా ఉన్న వ్యాసాలు తిరస్కరించబడతాయి:
i) పుస్తకాలు , పత్రికలు, డిజిటల్ మాధ్యమాలలో ముద్రించబడిన వ్యాసాలను , విషయాలను తీసుకొని యథాతథంగా వ్యాసం రచించకూడదు. ఇటువంటి వ్యాసాలు తిరసారించబడతాయి .
ii) టీవీ ఛానల్స్ లో , రేడియో లో, అంతర్జాలం లో ప్రసారమైన విషయాలను ఉపయోగించి యథాతథంగా వ్యాసరచన చేయకూడదు . అటువంటి వ్యాసాలు తిరస్కరించబడతాయి.
iii) కాపీ రైట్ కలిగిన వ్యాసాలు నుండి సేకరించి వ్రాసిన వ్యాసాలు కూడా తిరస్కరించబడతాయి
iv) వ్యాసాన్ని మీ చేతి వ్రాత తో మాత్రమే వ్రాయవలసి ఉంటంది, టైపు చేసినవి, electronic pen వాడి వ్రాసినవి తిరస్కరించబడతాయి.
9) వ్యాస రచనలో సందేహ నివృత్తికి క్రింద ఇవ్వబడిన e-mail చిరునామాకు మీ సందేహాలను పంపగలరు Sripranavpeetham.events@gmail.com
వ్యాస సమర్పణకు సూచనలు
1) మీరు వ్రాసిన వ్యాసాన్ని స్కాన్ చేసి PDF ఫార్మాట్ లో మాత్రమే పంపవలసి ఉంటుంది.
2) వ్యాసం వ్రాసిన అన్ని పేజీలను scan చేసి ఒకే PDF రూపములో పొందుపరచాలి. విడివిడిగా పంపకూడదు.
3) వెబ్సైటు లో ఉన్న ఫారం ద్వారా మాత్రమే PDF అప్లోడ్ చేయవలసి ఉంటంది. ఇతర ఏ మార్గం లో కానీ వ్యాసం స్వీకరించబడదు .
4) మీరు ఫారం లో మీ పేరు , whatsapp మొబైలు నెంబర్, ఇ-మెయిల్ ID తప్పులు లేకుండా పూర్తి చేయవలసి ఉంటంది. వాటిలో ఏది తప్పు ఉన్నా మార్చబడదు (సూచన: మీ పేరు Government Authorised Proof లో ఉన్న విధముగా నమోదు చేయగలరు , మీరు నమోదు చేసుకున్న పేరుతో ప్రశంసాపత్రము జారీచేయబడుతుంది).
5) మీరు స్కాన్ చేసిన మీ వ్యాసమునకు సంబంధంచిన PDF ను ఒకసారి సరిచూసుకున్న తరువాత upload చేయండి.
6) మీ వ్యాసాన్ని సమర్పించడానికి ముందు మీ PDF ను మీ వయస్సు, మీ పేరు , ఫార్మాట్ లో Rename చేసుకొని సమర్పించాలి. (ఉదాహరణ: మీ పేరు శ్రీరామ , వయస్సు 30, అప్పుడు pdf పేరు : 30_srirama )
7) PDF upload చేయటానికి సూచనలు :
i) Scan చేసిన PDF స్పష్టంగా కనిపించాలి , సరిగ్గా కనిపించని వ్యాసం తిరస్కరించబడుతుంది .
ii) మీ చేతి వ్రాత అర్థం అయ్యేలా ఉండాలి. అలా లేనిచో మీ వ్యాసం స్వీకరించబడదు.
iii) PDF మాత్రమే upload చేయాలి, ఇతర ఫార్మాట్ upload చేసిన వ్యాసం తిరస్కరించబడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు వాటి సమాధానాలు
1)ప్రశ్న:నేను వ్యాస రచన పోటీల్లో పాల్గొనవచ్చా ?
జవాబు: 7 సంవత్సరాలు పైన వయస్సు కలిగి తెలుగు వ్రాయగలిగిన ప్రతి ఒక్కరూ వ్యాసం వ్రాయవచ్చు.
2)ప్రశ్న:నేను ఏ అంశం పైన వ్యాసరచన చేయాలి?
జవాబు: మీ వయో విభాగం లో ఇవ్వబడిన అంశాన్ని ఎంపిక చేసుకొని వ్యాస రచన చేయవలసి ఉంటుంది.
3)ప్రశ్న: నేను ఎన్ని వ్యాసాలను రచించవచ్చు ?
జవాబు: మీ వయోవిభాగం లో ఇవ్వబడిన అంశాన్ని వ్యాస రచన చేయవలసిఉంటుంది.
4)ప్రశ్న:నేను వ్యాసం ఎక్కడ రాయాలి ?
జవాబు : A4 paper పైన, Blue (or) Black Ball Pen ఉపయోగించి మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. పది (10)సంవత్సరముల లోపు పిల్లలు మాత్రమే పెన్సిల్ ఉపయోగించవచ్చు.
5)ప్రశ్న : నేను వ్యాసాన్ని ఎలా సమర్పించాలి ?
జవాబు: మీరు వ్రాసిన వ్యాసాన్ని స్కాన్ చేసి PDF ఫార్మాట్ లో మీ వయస్సు _మీపేరు తో ( Ex: 30_srirama ) లాగా save
చేసి సమర్పించవలసి ఉంటుంది.
7)ప్రశ్న: నేను వ్యాసాన్ని టైపు చేసి సమర్పించవచ్చా?
జవాబు: వ్యాసాన్ని మీ చేతి వ్రాత తో మాత్రమే వ్రాయవలసి ఉంటుంది, టైపు చేసినవి, electronic pen వాడి వ్రాసినవి తిరస్కరించబడతాయి
8.ప్రశ్న : నేను వ్యాసాన్ని వ్రాయటానికి నిబంధనలు ఏమిటి ?
జవాబు: i) మీరు ఎంచుకన్న అంశం గురించి మొత్తం తెలుసుకొని పూర్తిగా మీ మాటల్లోనే వ్రాయాలి.
ii)వ్యాసాన్ని ప్రారంభించడానికి ముందు కాగితం పైన మీ పూర్తి పేరు, ఊరు , మీవయోవిభాగం, మీరు ఎంచుకున్నఅంశం వంటి వివరాలను నింపిన తర్వాత వ్యాసాన్నివ్రాయవల్సి ఉంటుంది
iii)క్రింద ఇవ్వబడిన నాలుగు విషయాలను ఖచ్చితంగా ప్రస్తావించి వ్యాస రచన చేయాలి.
అ) ఉపోద్ఘాతము లేదా ప్రస్తావన
ఆ) విషయ వివరణ
ఇ) జీవితాన్వయము లేదా నీతి
ఈ) ముగింపు
iv)మీ వ్యాసం కనీసం 3 కాగితాలు ఉండాలి, గరిష్ఠంగా 6 కాగితాలు మించి వ్రాయకూడదు (A4 సైజు పేపర్).
9.)ప్రశ్న:నా వ్యాసం ఎప్పుడు తిరస్కరించబడుతుంది?
జవాబు: i)పుస్తకాలు , పత్రికలు, డిజిటల్ మాధ్యమాలలో ముద్రించబడిన వ్యాసాలను , విషయాలను తీసుకొని యథాతథంగా వ్యాసం రచించకూడదు. ఇటువంటి వ్యాసాలు తిరస్కరించబడతాయి .
Ii) టీవీ ఛానల్స్ లో , రేడియో లో, అంతర్జాలం లో ప్రసారమైన విషయాలను ఉపయోగించి యథాతథంగా వ్యాసరచన చేయకూడదు . ఇటువంటి వ్యాసాలు తిరస్కరించబడతాయి.
Iii) కాపీ రైట్ కలిగిన వ్యాసాలు నండి సేకరించి వ్రాసిన వ్యాసాలు కూడా తిరస్కరించబడతాయి
. iv) వ్యాసాన్ని మీ చేతి వ్రాత తో మాత్రమే వ్రాయవలసి ఉంటంది, టైపు చేసినవి, electronic pen వాడి వ్రాసినవి తిరస్కరించబడతాయి
v)Scan చేసిన PDF స్పష్టంగా కనిపించాలి , సరిగ్గా కనిపించని వ్యాసం తిరస్కరించబడుతుంది .
vi)మీ చేతి వ్రాత అర్థం అయ్యేలా ఉండాలి. అలా లేనిచో మీ వ్యాసం స్వీకరించబడదు.
vii)PDF మాత్రమే upload చేయాలి, ఇతర ఫార్మాట్ upload చేసిన వ్యాసం తిరస్కరించబడుతుంది.
ఒక విషయాన్ని వివరంగా విస్తారించి రాయటమే వ్యాసం. వ్యాసరచన జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది.
వ్యాసరచనపు పోటీలలో పాల్గొనే అభ్యర్థులు ఈ క్రింది వివరాలు సమాధానపపత్రం లో రాయవలిసి ఉంటుంది .
1. పూర్తి పేరు: .........................................
2. నివాస స్థలం : .....................................
3. వయస్సు: ..........................................
4. వర్గము : .......................................... (ప్రథమ/ద్వితీయ/తృతీయ/చతుర్థ)
5. మీరు ఇచ్చిన అంశము: ..........................................
6. ఉపోద్ఘాతము లేదా ప్రస్తావన : ..........................................
7. విషయవివరణ:..................................................................................................................................
…………………………………………………………………………………………………………………………………….
8. జీవితాన్వయము లేదా నీతి: ..................................................................................................................
…………………………………………………………………………………………………………………………………….
9. ముగింపు:..........................................................................................................................................
బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్ధతాం
బలం గురోః ప్రవర్ధతాం బలం గురోః ప్రవర్ధతాం బలం గురోః ప్రవర్ధతాం
లోకాః సమస్తా సుఖినో భవంతు
Form closed. ఫారమ్ మూసివేయబడింది.