Jan 01 2023జనవరి 01 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 01 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షము

తిథి : దశమి రాత్రి 10గం౹౹18ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భానువారం  (అదివారం)  
నక్షత్రం : అశ్విని  సాయంత్రం 04గం౹౹33ని౹౹  వరకు తదుపరి భరణి
యోగం :  శివ ఉదయం 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  తైతుల ఈ రోజు ఉదయం 06గం౹౹47ని౹౹ వరకు  తదుపరి  గరజి
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹05ని౹౹ నుండి 04గం౹౹49ని౹౹ వరకు 
వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹34ని౹౹ నుండి 02గం౹౹10ని౹౹ వరకు & రాత్రి 01గం౹౹20ని౹౹ నుండి 03గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 09గం౹౹14ని౹౹ నుండి 10గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹32ని౹౹ 

👉🏻🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి జన్మ దివసము🕉️

గురుబోధ
గురువు లేని వారు సులభంగా తరించలేరు. గురువు పాదాల దగ్గర సర్వస్యశరణాగతి చేయాలి. గురువు ద్వారా మంత్రోపదేశం పొందడం వలన ఈ జన్మలోనే ముక్తి వచ్చి తీరుతుంది. ఇలా తీసుకొన్న వ్యక్తి పునర్జన్మ ఎత్తినట్లే. గురువులకు చేసే పాదపూజలో తులసీపత్రములను వాడరాదు. గురువుల వద్ద తల ఎత్తి సూటిగా కళ్ళలో చూసి మాట్లాడరాదు. భక్తిశ్రద్ధలతో వినయంగా తలవంచుకొని మాట్లాడాలి. 


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less