Dec 25 2022డిసెంబర్ 25 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 25 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షము

తిథి : విదియ ఉదయం 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భానువారం  (అదివారం)  
నక్షత్రం : ఉత్తరాషాఢ  రాత్రి 11గం౹౹41ని౹౹  వరకు తదుపరి శ్రవణం
యోగం :  వ్యాఘాత ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం :  కౌలవ ఈ రోజు ఉదయం 08గం౹౹24ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 10గం౹౹15ని౹౹ వరకు & తెల్లవారి 03గం౹౹24ని౹౹ నుండి 04గం౹౹53ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 04గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹31ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹28ని౹౹ 

👉🏻🕉️శ్రీ దత్తావతారం- గాణగాపుర- శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారి జయంతి🕉️

గురుబోధ

ఇష్టమైన భగవన్నామము, స్తోత్రము లేదా గురువులు ఉపదేశించిన మంత్రమును నిత్యము అనుష్ఠానం చేయడం లేదా మననం చేయడం వల్ల ఆ మంత్రము లేదా నామముకు సంబంధించిన  దేవతానుగ్రహం కలిగి వాక్శుద్ధి ఏర్పడుతుంది. అందుకే తప్పక ఒక్క మంత్రం లేదా నామము నిత్యం మననము చేస్తూ ఉండాలి.


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less