Dec 07 2022డిసెంబర్ 07 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 07 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశీర్షమాసం శుక్లపక్షము

తిథి : చతుర్దశి ఉదయం 07గం౹౹12ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : సౌమ్యవారం  (బుధవారం)  
నక్షత్రం : కృత్తిక ఈ రోజు ఉదయం 10గం౹౹21ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం :  సిద్ధ తెల్లవారి (08వ తేదీ) 02గం౹౹55ని౹౹ వరకు
కరణం :  వణిజ ఈ రోజు ఉదయం 08గం౹౹01ని౹౹ వరకు తదుపరి విష్టి 
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹  వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹29ని౹౹ నుండి 12గం౹౹13ని౹౹ వరకు 
వర్జ్యం : తెల్లవారి 03గం౹౹23ని౹౹ నుండి 05గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 07గం౹౹50ని౹౹ నుండి 09గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹20ని౹౹ వరకు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹ 

👉🏻🕉️శ్రీ దత్త జయంతి🕉️

గురుబోధ
దత్తాత్రేయుడు ఒక విచిత్రమైనటువంటి దైవం. ఆయన ఇవ్వడం మొదలుపెడితే పుచ్చుకోవడానికి రెండు చేతులూ సరిపోవు కనుక కార్తవీర్యార్జునుడు వేయి చేతులు కోరుకోవలసి వచ్చింది. అంతటి కరుణాస్వరూపుడు. అనేకమైన పరీక్షలు పెడతాడు. విచిత్ర రూపాలతో దర్శనమిస్తాడు. అందునా ఈ కలియుగంలో దత్తాత్రేయుడు చాలా సులభంగా కూడా మానవులకు దర్శనమిస్తాడు. చిన్న స్తోత్రంతో ఉప్పొంగిపోతాడు. అదే సమయంలో కఠిన పరీక్షలు పెడతాడు. ఆయన పరీక్షల నుండి ఉత్తీర్ణులమై, ఆయన అనుగ్రహం పొంది సకల శుభాలను పొందడానికి శ్రీ దత్తాత్రేయ స్తోత్రం తప్పక పారాయణం చేయాలి.



పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.

expand_less