" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 08 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి : పూర్ణిమ మధ్యాహ్నం 03గం౹౹40ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : భరణి రాత్రి 01గం౹౹31ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం : వ్యతీపాత ఈ రోజు రాత్రి 09గం౹౹46ని౹౹ వరకు తదుపరి వరీయాన్ కరణం : బవ ఈ రోజు సాయంత్రం 04గం౹౹35ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹06ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹16ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 10గం౹౹41ని౹౹ నుండి 12గం౹౹20ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 08గం౹౹34ని౹౹ నుండి 10గం౹౹23ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹27ని౹౹ పాక్షిక చంద్రగ్రహణం - 8 నవంబర్, కార్తికపూర్ణిమ(మంగళవారం) మ౹౹ 2.38 నుండి సా౹౹ 6.18 వరకు కార్తిక పూర్ణిమ, చంద్రజయంతి, గురునానక్ జయంతి, దక్ష సావర్ణిక మన్వాది(షన్నావతి శ్రాద్ధము-పితృతర్పణం) గురుబోధ ఎన్నో జన్మల సంస్కారం ఉంటే గాని పరమపవిత్రమైన కార్తిక పూర్ణిమను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన రాదు. ముఖ్యంగా దీపం వెలిగించడం, దానం చేయడం, ఆలయ దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ, నదీస్నానం లేదా పురాణం వినడం వంటివి ఏవో ఒకటి తప్పక చేయాలి.