" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 29 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసం శుక్లపక్షము తిథి : చతుర్థి ఉదయం 10గం౹౹25ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12గం౹౹02ని౹౹ వరకు తదుపరి మూల యోగం : అతిగండ ఈ రోజు రాత్రి 10గం౹౹21ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : భద్ర ఈ రోజు ఉదయం 08గం౹౹13ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹17ని౹౹ నుండి 07గం౹౹32ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 07గం౹౹33ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 03గం౹౹22ని౹౹ నుండి 05గం౹౹55ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹00ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹31ని౹౹ 👉🏻🕉️నాగుల చతుర్థి🕉️ గురుబోధ • నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహ మూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసినతర్వాత తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి. • శ్రీ మద్ధేవి భాగవతము- నవమ స్కంధం లో ఉన్న ఈ ద్వాదశ నామమంత్రములను నిత్యం లేదా పర్వదినములలో పఠిస్తే నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు కూడా తొలగిపోతాయని ఫలశ్రుతి. నాగదేవతా నామములు : 1. ఓం జరత్కారు ప్రియాయై నమః , 2. ఓం జగద్గౌర్యై నమః, 3. ఓం సిద్ధయోగిన్యై నమః, 4. ఓం నాగభగిన్యై నమః, 5. ఓం నాగేశ్వర్యై నమః, 6. ఓం విషహరాయై నమః, 7. ఓం జగత్కారవే నమః, 8. ఓం మనసాయై నమః, 9. ఓం వైష్ణవ్యై నమః, 10.ఓం శైవ్యై నమః, 11. ఓం ఆస్తీకమాత్రే నమః, 12. ఓం మహాజ్ఞానయుతాయై నమః