త్రయోదశ (13వ) శతావధానం – అష్టోత్తర శత మహిళా ప్రృచ్ఛకురాండ్రతో సరస్వతీ సమర్చనంత్రయోదశ (13వ) శతావధానం - అష్టోత్తర శత మహిళా ప్రృచ్ఛకురాండ్రతో సరస్వతీ సమర్చనంfavorite_border

Start Dateప్రారంభపు తేది
Friday, October 28, 2022
End Dateచివరి తేది
Sunday, October 30, 2022
శ్రీ మహాగణాధిపతయేనమః   శ్రీ గురుభ్యోనమః   శ్రీ మహాసరస్వత్యైనమః

"సప్తఖండ అవధాన సాహితీ ఝరి" శీర్షికలో -
త్రిభాషామహాసహస్రావధాని, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 
◆త్రయోదశ (13వ) శతావధానం - అష్టోత్తర శత మహిళా ప్రృచ్ఛకురాండ్రతో సరస్వతీ సమర్చనం◆

తేదీ: అక్టోబరు నెల 28, 29, 30వ తేదీలలో
వేదిక: అంతర్జాలం, శ్రీప్రణవపీఠం, ఏలూరు
Youtube Live:
https://youtube.com/@BrahmasriVaddipartiPadmakar

ఈ అపురూప శతావధానం ప్రత్యేకతలు:
- ప్రప్రథమంగా 108 మంది మహిళాశిరోమణులు అన్నిఖండాలనుండి పృచ్ఛకురాండ్రుగా పాల్గొనడం.
- సాహితీచరిత్రలో తొలిసారి కేవలం సమస్యలు(75), ఆశువు అంశాలతో జరుగుతున్న శతావధానం.

సంచాలకులు: "అవధాన రాజహంస", "సహస్రావధాని" శ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహం గారు.

ప్రారంభోత్సవ సభ - అక్టోబరు 28వ తేదీ - ఉదయం 8.00 గం.లకు భారతకాలమాన ప్రకారం
విజయోత్సవ సభ -  అక్టోబరు 30వ తేదీ - సాయంత్రం 4.00 గం.లకు భారతకాలమాన ప్రకారం

విజయోత్సవ సభకు హాజరవుతున్న ప్రముఖులు:
మాజీ ఉపరాష్ట్రపతివర్యులు - శ్రీయుతులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు,
మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్, మాజీ అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోల్సాని మురళీధరరావుగారు మరియు ఇతర ప్రముఖులు.

నేటికి 1265 కి పైగా వివిధ రకాలైన అవధానాలు చేసిన అవధానదురంధరుల అద్వితీయ శతావధానాన్ని అంతర్జాల మాధ్యమముగా యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును. పదిమందికీ తెలియజేయండి, సాహితీ వినోదాన్ని పంచుతూ సాగే అపురూప అవధానాన్ని తిలకించండి.

https://youtube.com/@BrahmasriVaddipartiPadmakar

బలం గురోః ప్రవర్ధతాం
expand_less