Brahmasri Vaddiparti Padmakar
Tribhasha Mahasahasravadhani, founder of Sri Pranavapeetham, Eluru, Brahmasri Vaddiparti Padmakar was born on January 1, 1966, in Jogannapalem of West Godavari district to Brahmasri Vaddiparti Chalapathirao garu and Smt. Seshamani garu.
Brahmasri Vaddiparti Chalapathirao garu was a scholar in Sanskrit and Hindi. He was proficient in eight languages and was a noted scholar. His wife Smt. Seshamani too was fluent in Sanskrit and Hindi languages.
Brahmasri Vaddiparti Padmakar imbibed the mastery of both the languages from his parents at an early age.
Brahmasri Padmakar holds master’s degree (M.A.) in each of the three languages of Telugu, Sanskrit and Hindi.
He worked as a Telugu Lecturer in Sir C. R. Reddy Educational Institutions, Eluru from 1993 to 2004.
Academic Achievements:
He stood First in the M.A. Telugu Examinations held at the Bhimavaram P G Centre of Andhra University in 1992.
‘Bangalore Vidya Samvardhani Parishat’ of Bangalore held a competitive examination named “Andhra Bhashabhushana Pareeksha”, the same year for 14 students who stood First in their respective universities.
Brahamsri Padmakar stood First in that exam and won a Gold Medal.
Sri Mallampalli Sarabhayya of the ‘Bangalore Vidya Samvardhani Parishat’ presented to him the Gold Medal along with the honorary title “Andhra Bhashabhushana.”
Honors & Awards
S # | Titles/Awards/Felicitations | Year | Type of Honor | Award Authority |
---|---|---|---|---|
1 | Abhinava Suka | 1989 | Title | Mumukshu Jana Mahapeethadhipati Sri Sri Sri Lakshmana Yateendrulu during Bhavata Saptaha in Agrahara Gopavaram, Tadepalligudem, West Godavari District. |
2 | Andhra Murari | 1991 | Title | Bhagavata Saptaha Nirvahaka Sangham, Satyanarayanapuram, Bhadrachalam. |
3 | Panchamruta Pravachaka | 1992 | Title | Sri Gokaraju Rangaraju (earlier Principal), D.N.R. Bhimavaram College |
4 | Andhra Bhasha Bhushana | 1993 | Title | Vidyasamvardhini Parishat, Bangalore |
5 | Avadhana Kokila | 1995 | Title | Sir C.R.R. College, Eluru |
6 | Bhagavata Kalyana Krishna | 1995 | Title | Pothana Kalapeetham, Eluru |
7 | Saraswathi Puthra | 1995 | Title | Sri Helapuri Saraswata Samstha, Eluru, Sri Devarakonda Ramakrishna IAS |
8 | Kanakaabhishekam (Anointing with Gold) | 1997 | Felicitation | Kala Sravanthi, Bhimavaram |
9 | Kavi Rajasekhara | 1999 | Title | Telugu Sahiti Samkhya, Tadepalligudem, West Godavari District. |
10 | Pouranika Sarvabhouma | 1999 | Title | Sri Ramakoti Viswasanti Samajam, Eluru |
11 | 1st Suvarna Ghantakankanam (Gold bracelet) | 2000 | Felicitation | Sri Vagdevi Sahasraavadhana Samaakhya, Eluru |
12 | Dharana Chitragupta | 2000 | Title | Sri Jonnavithula Ramalingeswara Rao, Movie Lyricist |
13 | Sahasra Padma | 2000 | Title | Sri Vagdevi Sahasraavadhaana Samaakhya, Eluru |
14 | 2nd Suvarna Ghantakankanam (Gold bracelet) | 2002 | Felicitation | Ivaturi Charitable Trust, Visakhapatnam |
15 | Pallaki Arohanam (Palanquin Ascent) | 2002 | Felicitation | Sri Vagdevi Sahasraavadhana Samaakhya, Eluru |
16 | Ratharohanam (Chariot Ascent) | 2002 | Felicitation | Sri Radhakrishna Mandira Samaakhya, Brundavan, UP |
17 | 3rd Suvarna Ghantakankanam (Gold bracelet) | 2003 | Felicitation | Sri Sri Sri Ganapathi Sachidanandha Swamy, Dattapeetham, Mysore |
18 | Bachuvari Sahitya Puraskaram (1st) | 2003 | Award | Bachu Foundation Award (Bachu Koteswararao, founder) |
19 | Dharana Vedha Avadhaana Nidhi | 2003 | Title | Sri Sri Sri Ganapathi Sachidanandha Swamy, Dattapeetham, Mysore |
20 | Gajarohana Gandapenderam (Elephant Ascent and Gold Anklet) | 2004 | Felicitation | The Devotees group of Eluru |
21 | International Language Day Puraskaram | 2004 | Award | Andhra Pradesh Adhikara Bhasha Sangham |
22 | Sataavadhan Raajamannar Smaraka Puraskaram | 2005 | Award | Potti Sreeramulu Telugu Viswavidyalam |
23 | Award of Excellence | 2006 | Award | Telugu Association of North America (TANA), USA |
24 | Award of Excellence | 2006 | Award | Bay Area Telugu Association, California, USA |
25 | Bachuvari Sahitya Puraskaram (2nd) | 2007 | Award | Bachu Foundation Award (Bachu Koteswararao, founder) |
26 | Godavarimaata Award | 2007 | Award | Rudraraju Foundation, Ganapavaram |
27 | Memento | 2010 | Award | Telugu Samskritika Samiti, Houston, Texas, USA |
28 | Abhinava Vedabharathi | 2011 | Title | Vedic Educational & Devotional Academy (VEDA) |
29 | Pravachana Nidhi | 2017 | Award | Sri Sri Sri Ganapathi Sachidanandha Swamiji, Sri Dattapeetham, Swamiji’s 75th Birthday Celebrations, Mysore |
30 | World Book of Records(Recognized for the Avadhanam series “Sapta Khanda Avadhana Sahiti Jhari” as the first ever literary feat performed with countries in 7 continents across the world). | 2022 | Record | World Book of Records, United Kingdom |
31 | Wonder Book of Records(Recognized for the Avadhanam series “Sapta Khanda Avadhana Sahiti Jhari” as the first ever literary feat performed with countries in 7 continents across the world). | 2022 | Record | Wonder Book of Records, United Kingdom |
32 | Genius Book of Records(Recognized for the Avadhanam series “Sapta Khanda Avadhana Sahiti Jhari” as the first ever literary feat performed with countries in 7 continents across the world). | 2022 | Record | Genius Book of Records, London, UK |
33 | Telugu Book of Records(Recognized for the first ever Avadhanam performed in 3 languages (Telugu, Hindi, Sanskrit). | 2022 | Record | Telugu Book of Records |
34 | Sapta Khanda Avadhaana Sarvabhouma | 2022 | Title | Telugu Associations across the world |
35 | Sri Ghantasala Sahiti Puraskaram | 2022 | Award | Vamsi International, Subhodayam Group, Singapore Kalasarathi Group |
36 | Silicon Andhra Avadhaana Bharati | 2022 | Title | Silicon Andhra Association, California, USA |
37 | Avadhaana Kalaa Mouli | 2022 | Title | Renowned America Avadhaani, “Avadhaana Ksheerasaagara”, “Avadhaana Brahmajna” Sri Paladugu Sricharan garu |
38 | Felicitation in Bangalore | 2022 | Felicitation | Bangalore Gudi-Badi devotee group lead by Sri Subrahmanyam garu, Ex-Wipro Director |
39 | Puranavadhanapravachanparina | 2022 | Title | Sri Pavana Vanaprasthashram, Ahobilam; Sri Akhil Bharat Brahmin Karivena Nityannadana Satram, Srisailam. |
40 | ShabdaBrahma | 2023 | Title | Telugu Association of Metro Atlanta (TAMA) |
41 | Avadhaana Viswa Guru Brahma | 2023 | Title | America Telugu Association (ATA), Texas |
42 | Kanakaabhishekam (Anointing with Gold) | 2023 | Felicitation | America Telugu Association (ATA), Texas |
43 | 4th Suvarna Ghantakankanam (Gold bracelet) | 2023 | Felicitation | By Founder & Chairman – BrahmaSri Marepalli Naga Venkata Sastri garu of Sri Satyanarayana Swamy Devasthanam and VEDA (Vedic Education and Devotional Academy), Milpitas, California, USA |
44 | Pallakiseva in Bhagyanagar, Sanmanam | 2023 | Sanmanam | Bhagyanagar Temple-Badi Bhakta Team |
45 | Suvarnakankanpradanam (Gold Bracelet) | 2024 | Sanmanam | Darshanam Spiritual Monthly |
46 | Dharmikavarenya | 2024 | Title | Darshanam Spiritual Monthly |
47 | Avadhanamurari | 2024 | Title | Telugu Association of London (TAL) |
Entries in Books of Records:
World Book of Records, Wonder Book of Records, Genius Book of World Records, Telugu Book of Records and many more. He was honored with processions in a palanquin, on an elephant, on a horse and in a chariot on different occasions.
Avadhanams:
Brahmasri Padmakar performed 1256 ‘Ashtaaavadhanams’ in Telugu language so far.
He performed 21 Satavadhanams, the list of which is given below:
- Eluru (1995)
- Visakhapatnam (1997)
- Thadepalligudem (1999)
- Challapally (2001)
- Guntur (2003)
- Rajahmundry (2003)
- Narasa Raopet
- Hyderabad
- Secunderabad
- Hyderabad
- Secunderabad
- Hyderabad (Shubhodayam Media Group, Nov 2021)
- Online based Sataavadhaanam in Oct 2022 with 108 Female Questioners from 7 continents across the world.
- Allagadda, Kurnool (Nov 2022)
- Singapore Country (Jan 2023)
- In the State of Texas, U S A (America Telugu Association (ATA) Apr 2023)
- Bangalore, Karnataka, India (July 2023)
- Srikakulam, Andhra Pradesh, India (August 2023)
- Hyderabad, Telangana, India (January 2024)
- London, United Kingdom (July 2024)
- Bellary, Karnataka, India (August 2024)
Avadhanams performed with partners:
- 6 Avadhanams with Sri Kondepi Murali Krishna and 2 with Sri Sri Charan Paladugu
Avadhanam in Hindi:
- He performed an Avadhanm in Hindi in the CENTRAL HINDI DIRECTORATE, AGRA and won appreciation from the elite community of Agra.
Trilingual Mahasahasravadhanam:
- He performed a Mahasahasravadhana in Eluru in Andhra Pradesh, in Telugu Hindi and Sanskrit languages.
Unique and outstanding Dharana:
- Brahmasri Padmakar had the distinction of reciting 756 poems in 207 minutes (3 Hrs 27 Mnts) at a stretch without break.
- With his profound memory, he can recite thousands of verses of Bhagavata and thousands of verses of ancient poetry.
Distinguished achievement:
He was appointed as the official poet of ACP Industries (‘Ambika Darbar Bathi’) for his discourses on ‘Ashtadasa Puranas’ apart from Bharatam, Bhagavatam and Ramayanam.
‘Bhagavata Saptahas’:
- Brahmasri Padmakar organized ‘Bhagavatha Saptahas’ in the states of Andhra Pradesh, Karnataka, Uttar Pradesh, Bihar, Madhya Pradesh, Kerala, Tamil Nadu, and in holy pilgrim centers of Naimisaranyam, Sukasthal, Varanasi and Brindavan.
- He can give a full discourse on ‘Bhagavatha Purana’ without referring to written script.
- He gave discourses on 18 puranas by Vedavyasa which includes Sri Devi Bhagavatam discourse for nine days in the holy place of ‘Vindhyachalam’ near Kasi.
Eminent Sadguru:
Brahamasri Padmakar gave ‘Mantra’ to nearly 5 lakh devotees to strengthen their spiritual practices. He established Sri Pravnava Peetham in the year 2003 in Eluru and his disciples refer to him as ‘Samrtha Sadguru’ with utmost devotion.
Teachings through his discourses:
- Everyone must learn Puranas, protect, and strengthen Hinduism by being loyal to it and practicing the principles of Dharma.
- Changing religion and Dharma is a great sin as Srimad Bhagavad Gita says:
“Sreyanswadharmo vigunah paradharmaatswanushtitat |
Swadharme nidhanm sreyah paradharmo bayavahah ||
- Worship God! Treat your home like a temple. A house without God is like a graveyard. Eating food without offering it to God is a sin.
- If one develops jealousy towards successful people, it results in mental distress. Goddess Mahalakshmi deserts those people who suffer from jealousy. And invariably, Goddess Saraswathi accompanies her.
- Avoid being cruel whatever be the situation and do not abuse anyone.
- Keep Salagrama and Shivalinga at home. Salagramas are the form of Vishnu. Performing Abhishekam to Salagram removes all sins.
- People who constantly remember and chant the Lord’s name will reach heaven. To avoid karma, one should receive a mantra from a good guru and chant that mantra continuously.
Honors:
- Procession in a palanquin (Pallaki vuruegimpu in Eluru)
- Helicopter flight
- Ratharohana in Brindavanam, Agra District, Uttar Pradesh, and innumerable public honors.
- Gajarohana and Gandapendera Satkaras at Eluru.
Literary Contributions:
- Kalakinkinulu
- Sri Sathya Sai Saptasati
- Sri Neelakantheswara Satakam
- Hanuman Mahima 750 poems Khanda Kavyam,
- ‘Manavakatha’
- Iswarya Yogam
- Sri Devibhagavatam
- Sri Venkateswara Vilasam
And many other stories and articles.
Literary Stage performances:
- The roles of Tenali Ramakrishna in Bhuvana Vijaya
- Chellapilla in Avadhani Vijaya and
- Narada in Sudharma Sabha.
- Extempore rendering:
Reciting 180 verses in 90 minutes.
Padayatra:
- Pilgrimage to famous temples like Dwarakathirumala, Vijayawada Kanakadurga Temple etc. in Andhra with thousands of devotees.
Institutional Scholar: (Asthana Vidvansulu)
- He was appointed as an Official Institutional scholar of Avadhuta Datta Peetha, Mysore in May 2003.
Appreciations from the reverend:
“Dharanavedavadhananidhi Brahmasri Vaddiparti Padmakar was born as an embodiment of Vyasa and Potana.”
– Sri Sri Ganapati Satchidananda Swami, Mysore.
“Srimad Bhagavatam originated in the form of Sri Padmakar.”
– Bhagavan Sri Sathya Sai Baba, Puttaparthi, In 2008 during the discourse on ‘Prahladacharitra’ in his presence.
“Sri Padmakar’s poetry is very good. These are stories that everyone should know.”
– Sri Sri Bharti Tirtha Mahaswami, Sringeri Sarada Peetham.
“Dhanyajivi (Blessed Soul) Padmakar. He was born with the glory of Goddess Parvati.
– Sri Sri Sri Jayendra Saraswati Swami, Kanchi Kamakoti Math.
I witnessed the greatness of Sri Padmakar’s Dharana in “Shatavadhanam”. Sri Padmakar is one who has full grace of Lord Krishna. (On the occasion of Sri Padmakar’s “Satavadhanam” dharana at Visakhapatnam in 1997)
– Sriman Sribhashyam Appalacharyu, Visakhapatnam.
“Sri Padmakar garu is the descended form of Shukamaharshi”.
– Sri Sri Sri Lakshmana Yatindralu, Pedamutthevi.
Ph.D. on Brahmasri Vaddiparti Padmakar
After watching the ‘SATAAVADHANAM’ performed by Brahmasri Vaddiparti Padmakar, Sri Samudrala Venkata Vedantacharyulu, Professor and Head of the department of Mathematics, submitted a research paper on Brahmasri Padmakar to Sri Acharya Nagarjuna University and obtained Ph.D. in Telugu.
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల దివ్య జీవన కవన విశేషాలు:
త్రిభాషామహాసహస్రావధాని,ప్రణవపీఠాధీశులు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 1966 జనవరి 1వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా జోగన్నపాలెంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారు, శ్రీమతి శేషమణి పుణ్యదంపతులకు జన్మించారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావుగారు ఎనిమిది భాషలలో ప్రావీణ్యం కలవారు మరియు ప్రముఖ పండితులు. తల్లి శ్రీమతి శేషమణి గారు సంస్కృతం మరియు హిందీ భాషలలో నిష్ణాతులు.
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి పాండిత్యం పుణికిపుచ్చుకున్నారు. వీరు తెలుగు, సంస్కృతం మరియు హిందీ భాషలలో ఎం.ఏ. పట్టభద్రులు. 1993 నుండి 2004 వరకు ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి విద్యాసంస్థలలో తెలుగు లెక్చరర్‌గా విధులు నిర్వర్తించారు. గణితశాస్త్ర అధ్యాపకులు, విభాగాధిపతి శ్రీ సముద్రాల వెంకట వేదాంతాచార్యులు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానం ప్రత్యక్షంగా చూసిన తర్వాత వారిపై పరిశోధన చేసి శ్రీ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పిహెచ్.డి. పట్టా పొందారు.
సాహితీ సింహావలోకనం:
1992వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, భీమవరం పి.జి సెంటర్ మొత్తానికి ఎం.ఏ తెలుగులో ప్రథమస్థానం (ఫస్ట్ ర్యాంక్) సాధించారు. ఇలా అన్ని విశ్వవిద్యాలయాల నుండి ప్రథమస్థానమును పొందిన వారికి “బెంగుళూరు విద్యా సంవర్ధనీ పరిషత్” వారు “ఆంధ్రభాషాభూషణపరీక్ష” నిర్వహించారు. అందులో 14 విశ్వవిద్యాలయాల నుండి ప్రథమస్థానం పొందిన వారు పోటీలో పాల్గొన్నారు. ఈ 14 మందిలో మళ్ళీ ప్రథమస్థానంతో స్వర్ణ పతకం( గోల్డ్ మెడల్) సాధించగా, బెంగళూరు విద్యా సంవర్ధనీ పరిషత్ నుండి శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి చేతుల మీదుగా బంగారు పతకంతో పాటు “ఆంధ్రభాషాభూషణ” అనే బిరుదును పొందారు.
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు పొందిన ఇతర అవార్డులు, సత్కారాలు:
బిరుదులు, సన్మానాలు & పురస్కారాలు
క్ర.సం. | బిరుదులు / పురస్కారాలు /సన్మానాలు | సంవత్సరం | విభాగం | సంస్థ/అందించినవారు |
---|---|---|---|---|
1 | అభినవశుక | 1989 | బిరుదు | పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం దగ్గర అగ్రహారగోపవరం లో జరిగిన భాగవత సప్తాహ సందర్భంగా ఆనాటి ముముక్షు జన మహాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు |
2 | ఆంధ్రమురారి | 1991 | బిరుదు | భాగవత సప్తాహ నిర్వాహక సంఘం, సత్యనారాయణపురం, భద్రాచలం |
3 | పంచామృత ప్రవచక | 1992 | బిరుదు | శ్రీ గోకరాజు రంగరాజు ఆనాటి, డి.ఎన్.ఆర్. భీమవరం కళాశాల అధ్యక్షులు |
4 | ఆంధ్రభాషాభూషణ | 1993 | బిరుదు | విద్యాసంవర్ధినీ పరిషత్, బెంగళూరు |
5 | అవధానకోకిల | 1995 | బిరుదు | సర్.సి.ఆర్.ఆర్.కళాశాల, ఏలూరు శతావధానం సందర్భంగా |
6 | భాగవత కల్యాణకృష్ణ | 1995 | బిరుదు | పోతన కళాపీఠం, ఏలూరు |
7 | సరస్వతీపుత్ర | 1995 | బిరుదు | హేలాపురీ సారస్వత సంస్థ వారు, శ్రీ దేవరకొండ రామకృష్ణ, IAS గారి చేతుల మీదుగా |
8 | కనకాభిషేకం | 1997 | సన్మానం | కళా స్రవంతి, భీమవరం |
9 | కవిరాజశేఖర | 1999 | బిరుదు | తెలుగు సాహితీ సంఖ్య, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా |
10 | పౌరాణిక సార్వభౌమ | 1999 | బిరుదు | శ్రీరామకోటి విశ్వశాంతి సమాజం, ఏలూరు |
11 | మొదటి (1వ) సువర్ణఘంటాకంకణ ప్రదానం | 2000 | సన్మానం | శ్రీ వాగ్దేవి సహస్రావధాన సమాఖ్య, ఏలూరు |
12 | ధారణాచిత్రగుప్త | 2000 | బిరుదు | శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, సినీ గేయ రచయిత సహస్రావధానం సందర్భంగా |
13 | సహస్రపద్మ | 2000 | బిరుదు | శ్రీ వాగ్దేవి సహస్రావధాన సమాఖ్య, ఏలూరు |
14 | రెండవ (2వ) సువర్ణఘంటాకంకణ ప్రదానం | 2002 | సన్మానం | ఇవటూరి ఛారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం |
15 | పల్లకీ ఆరోహణం | 2002 | సన్మానం | శ్రీ వాగ్దేవి సహస్రావధాన సమాఖ్య, ఏలూరు |
16 | రథారోహణం | 2002 | సన్మానం | శ్రీ రాధాకృష్ణ మందిర సమాఖ్య, బృందావన్, యుపి |
17 | మూడవ (3వ) సువర్ణఘంటాకంకణ ప్రదానం | 2003 | సన్మానం | శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి దత్తపీఠం, మైసూర్ |
18 | బచ్చువారి సాహితీ పురస్కారం (1వ) | 2003 | పురస్కారం | బచ్చు ఫౌండేషన్ పురస్కారం (బచ్చు కోటేశ్వరరావు, వ్యవస్థాపకుడు) |
19 | ధారణా వేదావధాననిధి | 2003 | బిరుదు | శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, దత్తపీఠం, మైసూర్ |
20 | గజారోహణ గండపెండేరం | 2004 | సన్మానం | ఏలూరు భక్త బృందం |
21 | ప్రపంచ భాషాదినోత్సవ పురస్కారం | 2004 | పురస్కారం | ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం |
22 | శతావధాన రాజమన్నార్ స్మారక పురస్కారం | 2005 | పురస్కారం | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం |
23 | ఎక్సెలెన్సీ పురస్కారం | 2006 | పురస్కారం | ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), USA |
24 | ఎక్సెలెన్సీ పురస్కారం | 2006 | పురస్కారం | బే ఏరియా తెలుగు అసోసియేషన్, కాలిఫోర్నియా, USA |
25 | బచ్చువారి సాహితీ పురస్కారం (2వ) | 2007 | పురస్కారం | బచ్చు ఫౌండేషన్ పురస్కారం (బచ్చు కోటేశ్వరరావు, వ్యవస్థాపకుడు) |
26 | గోదావరీమాత పురస్కారం | 2007 | పురస్కారం | రుద్రరాజు ఫౌండేషన్, గణపవరం |
27 | మెమెంటో (స్మారక పురస్కారం) | 2010 | పురస్కారం | తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్, టెక్సాస్, USA |
28 | అభినవవేదభారతి | 2011 | బిరుదు | వేద ఎడ్యుకేషనల్ & డివోషనల్ అకాడమీ (వేద) |
29 | ప్రవచన నిధి | 2017 | పురస్కారం | శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి దత్తపీఠం, మైసూర్, స్వామీజీ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా |
30 | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్తెలుగు సాహితీచరిత్రలో ప్రపంచంలోని అన్ని ఖండాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయ పృచ్ఛకులను భాగస్వాములను చేసిన మొట్టమొదటి కార్యక్రమంగా సప్తఖండ అవధాన సాహితీ ఝరికి గుర్తింపు | 2022 | రికార్డు (ప్రపంచవ్యాప్త గుర్తింపు) | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) |
31 | వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ప్రపంచంలోని అన్ని ఖండాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయ పృచ్ఛకులను భాగస్వాములను చేసిన మొట్టమొదటి కార్యక్రమంగా సప్తఖండ అవధాన సాహితీ ఝరికి గుర్తింపు | 2022 | రికార్డు (ప్రపంచవ్యాప్త గుర్తింపు) | వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) |
32 | జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ప్రపంచంలోని అన్ని ఖండాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయ పృచ్ఛకులను భాగస్వాములను చేసిన మొట్టమొదటి కార్యక్రమంగా సప్తఖండ అవధాన సాహితీ ఝరికి గుర్తింపు | 2022 | రికార్డు (ప్రపంచవ్యాప్త గుర్తింపు) | జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్, UK |
33 | తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్మూడు భాషలలో (తెలుగు, హింది, సంస్కృతం) చేసిన అపూర్వ త్రిభాషామహాసహస్రావధానముకు గుర్తింపు | 2022 | రికార్డు (ప్రపంచవ్యాప్త గుర్తింపు) | తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ |
34 | సప్త ఖండ అవధాన సార్వభౌమ | 2022 | బిరుదు | ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంఘాలు |
35 | శ్రీ ఘంటసాల సాహితీ పురస్కారం | 2022 | పురస్కారం | వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్, సింగపూర్ కళాసారథి గ్రూప్ |
36 | సిలికానాంధ్ర అవధానభారతీ | 2022 | బిరుదు | సిలికాన్ ఆంధ్రా అసోసియేషన్, కాలిఫోర్నియా, USA |
37 | అవధాన కళామౌళి | 2022 | బిరుదు | ప్రఖ్యాత అమెరికా అవధాని, “అవధాన క్షీరసాగర”, “అవధాన బ్రహ్మజ్ఞ” శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు |
38 | బెంగళూరులో సన్మానం | 2022 | సన్మానం | బెంగళూరు గుడి-బడి భక్త బృందం వారు, మాజీ విప్రో డైరెక్టర్, శ్రీ పోచనపెద్ది సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో |
39 | పురాణావధానప్రవచనపారీణ | 2022 | బిరుదు | శ్రీ పావన వానప్రస్థాశ్రమము, అహోబిలము; శ్రీ అఖిల భారత బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం, శ్రీశైలం |
40 | శబ్దబ్రహ్మ | 2023 | బిరుదు | తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) |
41 | అవధానవిశ్వగురుబ్రహ్మ | 2023 | బిరుదు | అమెరికా తెలుగు సంఘం (ATA), టెక్సాస్ |
42 | కనకాభిషేకం | 2023 | సన్మానం | అమెరికా తెలుగు సంఘం (ATA), టెక్సాస్ |
43 | నాలుగవ (4వ) సువర్ణఘంటాకంకణ ప్రదానం | 2023 | సన్మానం | శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం మరియు VEDA (వేద విద్య మరియు భక్తి అకాడమీ), మిల్పిటాస్, కాలిఫోర్నియా, USA యొక్క వ్యవస్థాపకులు & ఛైర్మన్ బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి గారు |
44 | భాగ్యనగరంలో పల్లకీసేవ, సన్మానం | 2023 | సన్మానం | భాగ్యనగర గుడి-బడి భక్త బృందం వారు |
45 | సువర్ణకంకణప్రదానం | 2024 | సన్మానం | దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక |
46 | ధార్మికవరేణ్య | 2024 | బిరుదు | దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక |
47 | అవధానమురారి | 2024 | బిరుదు | తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) |
అవధాన కోకిల, పంచామృత ప్రవచక, ఆంధ్ర మురారి, ఆంధ్రభాషాభూషణ, భాగవత కళ్యాణ కృష్ణ, పౌరాణిక సార్వభౌమ, కవిరాజశేఖర, సహస్రపద్మ, అభినవ వేదభారతి, శ్రీ నన్నయ భట్టారక పీఠం సాహిత్యపురస్కారం, ఆంధ్ర సారస్వత సమితి – మచిలీపట్నం ఉగాది అవార్డు.
ఇతర పురస్కారాలు: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటివి మరెన్నో.
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులను: 5 సువర్ణ ఘంటా కంకణ సత్కారాలు, 2 గండపెండేర సత్కారాలు, కనకాభిషేకం (బంగారపు జల్లు), పల్లకీలో ఊరేగింపు, ఏనుగు, గుఱ్ఱము, రథారోహణం లాంటి సత్కరాలు వరించాయి.
ఒకానొక సమయంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులకు తెల్లవారుజామున రైలులో ప్రయాణిస్తుండగా, సంస్కృతంలో 30 శ్లోకాలు పఠిస్తూ శ్రీమహాలక్ష్మీదేవి స్వప్న దర్శనమిచ్చి, ఆ శ్లోకాలను కవిత్వంగా వ్రాయమని గురుదేవులను అజ్ఞాపించారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ‘మా’ నవకథ (మా = లక్ష్మి, నవ = తొమ్మిది, కథలు – కథలు) అని లక్ష్మీదేవి యొక్క తొమ్మిది కథలను పద్యకావ్యంగా రచించారు. ఈ కథల ద్వారా సనాతన ధర్మ సిద్ధాంతాలు సులభంగా వివరించబడ్డాయి. మార్చి 31, 2019న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని శ్రీ శారదా పరమేశ్వరీ దేవస్థానంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శృంగేరి శారదాపీఠం జగద్గురువులు, శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి గురుదేవులను ఆశీర్వదించారు. మహాస్వామివారు పిల్లలను మరియు సనాతన ధర్మసిద్ధాంతాలను విశ్వసించే ప్రతి ఒక్కరినీ ఈ పుస్తకాన్ని చదువమని సూచించారు. చాలా మంది భక్తులకు మహాస్వామి వారే నేరుగా ఈ పుస్తకాన్ని ఇచ్చి ఆశీర్వదించారు.
అష్టావధానాలు : 1256
శతావధానాలు : 21
- ఏలూరు (1995)
- విశాఖపట్నం (1997)
- తాడేపల్లిగూడెం (1999)
- చల్లపల్లి (2001)
- గుంటూరు (2003)
- రాజమండ్రి (2003)
- నరసరావుపేట
- హైదరాబాదు
- సికింద్రాబాద్
- హైదరాబాదు
- సికింద్రాబాదు
- హైదరాబాదు (శుభోదయం సంస్థ, నవంబరు, 2021)
- అంతర్జాలం (సప్తఖండాల నుండి 108 మహిళా పృచ్ఛకురాండ్రతో, అక్టోబరు, 2022)
- ఆళ్ళగడ్డ, కర్నూల్ (నవంబరు, 2022)
- సింగపూర్ దేశం (జనవరి, 2023)
- అమెరికా దేశం, టెక్సాస్ రాష్ట్రం (అమెరికా తెలుగు సంఘం [ఆటా సంస్థ], ఏప్రిల్, 2023)
- బెంగళూరు, కర్ణాటక, భారతదేశం (జూలై 2023)
- శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం (ఆగస్టు 2023)
- హైదరాబాదు , తెలంగాణ, భారతదేశం (January 2024)
- లండన్, యునైటెడ్ కింగ్‌డమ్ (జూలై 2024)
- బళ్లారి, కర్ణాటక, భారతదేశం (ఆగస్టు 2024)
జంట అవధానాలు :
- శ్రీ కొండేపి మురళీ కృష్ణ గారితో కలిసి 6 మరియు శ్రీ శ్రీచరణ్ పాలడుగు గారితో 2 అవధానములు నిర్వహించినారు
హిందీ అవధానం :
- సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, ఆగ్రాలో హిందీలో అవధానం చేసి ప్రముఖుల ప్రశంసలు పొందిన ఏకైక త్రిభాషా మహాసహస్రావధాని
త్రిభాషా మహాసహస్రావధానం:
- ఏలూరులో ఆంధ్ర, హిందీ, సంస్కృతభాషలలో మహాసహస్రావధానం చేశారు.
అద్వితీయ ధారణ :
- 756 పద్యాలు కదలకుండా 207 ని॥లలో (3గం॥27॥ ని ॥లలో) ధారణ చేసిన ఏకైకసహస్రావధాని.
- భాగవతంలోని వేలాది పద్యాలు, ప్రాచీన కావ్యాలలోని వేలాది పద్యాలు ఆశువుగా చెప్పగలరు.
మరొక ప్రత్యేకత :
- భారత, భాగవత, రామాయణాలే కాక అష్టాదశ పురాణాలను ఉపన్యసించి, అంబికావారి ఆస్థాన పౌరాణికునిగా నియమితులైన ఏకైక సహస్రావధాని.
బిరుదులు :
- ఆంధ్రమురారి (1991)
- పంచామృత ప్రవచక (1992)
- అభినవశుక (1993)
- ఆంధ్రభాషా భూషణ (1993)
- అవధానకోకిల (1995)
- భాగవత కళ్యాణకృష్ణ (1995)
- సరస్వతీపుత్ర (1995)
- కవిరాజశేఖర (1999)
- పౌరాణిక సార్వభౌమ (1999)
- ధారణాచిత్రగుప్త (శ్రీ జొన్నవిత్తుల వారు ఇచ్చారు, 2000)
- సహస్రపద్మ (2000)
- ధారణా వేదావధాననిధి (శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇచ్చారు, 2003)
- సిలికానాంధ్ర అవధానభారతీ (జూలై, 2022)
- సప్త ఖండ అవధాన సార్వభౌమ (అక్టోబర్, 2022)
- అవధానవిశ్వగురుబ్రహ్మ (ఏప్రిల్, 2023)
భాగవతసప్తాహ ప్రత్యేకత :
- ఆంధ్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ,తమిళనాడులోను, నైమిశారణ్యము, శుకస్థల్, బృందావనాది పుణ్యక్షేత్రాలలోను భాగవత సప్తాహాలు చేశారు.
- భాగవతం మొత్తం పుస్తకం లేకుండా ప్రవచనం చేయగలిగిన ఏకైక సహస్రావధాని
- వింధ్యాచలంలో దేవీ భాగవత నవాహ ప్రవచనములు చేసినారు.
సమర్థ సద్గురుత్వము :
- దాదాపు 5,00,000 మందికి పైగా మంత్రోపదేశాలు చేసి వారిని ఆధ్యాత్మికమార్గంలో నడుపుతూ ప్రణవ పీఠం స్థాపించి శిష్యుల చేత ‘సమర్థ సద్గురు’ బిరుదు పొందారు.
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి బోధనలు:
★ “ప్రతి ఒక్కరూ హిందూ మతాన్ని కాపాడాలి. లేకుంటే పురాణాలు నేర్చుకుని చదివినా ప్రయోజనం ఉండదు. అదే మతంలో ఉంటూ ధార్మిక సూత్రాలను పాటించడం ఉత్తమం.. మతాన్ని, ధర్మాన్ని మార్చుకోవడం మహాపాపం. (శ్రీమద్భగవద్గీత నుండి –
“శ్రేయాన్ స్వధర్మో విగుణః | పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనమ్ శ్రేయః | పరధర్మో భయావహః ||
★ దేవుడిని ఆరాధించండి! మీ ఇంటిని దేవాలయంలా చూసుకోండి. దేవుడు లేని ఇల్లు శ్మశానం లాంటిది. భగవంతునికి సమర్పించని ఆహారాన్ని తినడం శవభోజనంతో సమానం.
★ మానసిక క్షోభకు ప్రధాన కారణం ఇతరుల శ్రేయస్సు పట్ల అసూయ చెందడం. ఇతరుల కీర్తిని చూసి అసూయపడే వ్యక్తిని మహాలక్ష్మీదేవి విడిచిపెడుతుంది. మహాలక్ష్మీదేవి ఒంటరిగా వెళ్లదు, ఆమె సరస్వతీదేవిని కూడా తనతో తీసుకువెళుతుంది.
★ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇతరుల పట్ల క్రూర స్వభావాన్ని మానుకోండి మరియు ఎవరినీ దుర్భాషలాడకండి.
★ ఇంట్లో సాలగ్రామం మరియు శివలింగాన్ని ఉంచండి. సాలగ్రామాలను విష్ణుస్వరూపంగా భావిస్తారు. ప్రతి ఇంట్లో సాలగ్రామాలు ఉంచడం మరియు అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. అభిషేకజలం మానవులకు అన్ని పాపాలను దూరం చేస్తుంది.
★ భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించే మరియు పఠించే వ్యక్తులు స్వర్గానికి చేరుకుంటారు. కర్మను నివారించడానికి, సద్గురువుల నుండి మంత్రాన్ని స్వీకరించాలి మరియు ఆ మంత్రాన్ని నిరంతరం జపించాలి. “
సన్మానాలు :
- పల్లకీ ఊరెరిగింపు (ఏలూరు)
- హెలికాప్టర్ అధిరోహణ
- సువర్ణ కంకణధారణ
- రథారోహణ, బృందావనం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్, ఇవి కాక అసంఖ్యాకంగా ప్రజా సత్కారాలు
- ఏలూరులో గజారోహణ మరియు గండపెండేర సత్కారాలు.
రచనలు :
- కలకింకిణులు(ముద్రితం)
- శ్రీ సత్యసాయి సప్తశతి(ముద్రితం)
- శ్రీనీలకంఠేశ్వర శతకం(ముద్రితం)
- హనుమన్మహిమ(అముద్రితం) 750 పద్యాల ఖండ కావ్యం, ‘మానవకథ’ పద్యకావ్యం, ఇంకా పలు కథలు, వ్యాసాలు.
రూపకాలు :
- వందలాది రూపకాలు నిర్వహించారు, భువన విజయంలో తెనాలి రామకృష్ణ, అవధాని విజయంలో చెళ్ళపిళ్ళ, సుధర్మా సభలో నారద పాత్రలు ప్రత్యేకాలు.
ఆశు కవితలో ప్రత్యేకత:
- 90 ని॥లలో 180 పద్యాలు ఆశువుగా చెప్పుట.
పాదయాత్రా ధురీణత :
- వేలాది భక్తులతో ఆంధ్రాలోని ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయం మొదలైన ప్రముఖ దేవాలయములకు పాదయాత్ర చేయించుట.
పీఠాధిపతుల సత్కారాలు :
- శృంగేరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు
- శ్రీశ్రీశ్రీ భగవాన్ సత్యసాయిబాబా
- శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీ
- శ్రీవిశ్వయోగి విశ్వంజీ
- శ్రీవాడేకర్మహారాజ్ వంటి ప్రముఖ పీఠాధిపతుల సత్కారాలు పొందారు.
ఆస్థాన విద్వాంసులు :
- 2003సం॥ మే నెల నుండి అవధూత దత్తపీఠము మైసూర్ వారి ఆస్థానవిద్వాంసులుగా నియమింపబడిరి.
విదేశీ పర్యటనలు :
- పురాణ ప్రవచనములు, సాహిత్యోపన్యాసాలు, అవధానాల నిమిత్తం సం॥ 2006 నుండి ప్రతి సంవత్సరము ఏప్రిల్, మే నెలలో అమెరికా లో ఉన్న కొన్ని ముఖ్యమైన పట్టణాలలో పర్యటిస్తుంటారు.
- సింగపూర్ లో ది.29-04-2006 నుండి ది.05-05-2006 వరకు అవధానాలు ప్రవచనాలు చేశారు చేశారు.
- దుబాయిలో ది.01-04-2008 నుండి ది.06-04-2008 వరకు పంచాంగ ప్రవచనములు, పురాణ ప్రవచనములు చేసారు
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురించి కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు:
“ధారణావేదావధాననిధి. వ్యాసుడు, పోతన కలయికతో జన్మించిన ధన్యజీవి (పుణ్యాత్ముడు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ … “
– శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, మైసూరు.
“శ్రీమద్ భాగవతం శ్రీ పద్మాకర్ రూపంలో ఉద్భవించింది. (2008లో పుట్టపర్తిలో ‘ప్రహ్లాదచరిత్ర’ ప్రవచనం సందర్భంగా.”
– భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, పుట్టపర్తి.
“శ్రీ పద్మాకర్ గారి కవిత్వం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కథలు ఇవి.”
– శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శృంగేరి శారదా పీఠం.
“ధన్యజీవి (బ్లెస్డ్ సోల్) పద్మాకర్. అతను పార్వతీదేవి యొక్క వైభవంతో జన్మించారు.
– శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, కంచి కామకోటి మఠం.
“శతావధానం”లో శ్రీ పద్మాకర్ ధారణ గొప్పతనాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. శ్రీకృష్ణభగవానుని సంపూర్ణ అనుగ్రహం కలిగిన వారు శ్రీ పద్మాకర్. (1997లో విశాఖపట్నంలో శ్రీ పద్మాకర్ గారి “శతావధానం” ధారణ సందర్భంగా)
– శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు,విశాఖపట్నం.
“శుకమహర్షి రూపాంతరం చెందిన రూపం శ్రీ పద్మాకర్ గారు”.
– శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులు, పెదముత్తేవి.