Sri Vaddiparti Padmakar

PRATYEKA DHARMA SANDEHAALU – FOR CHILDREN

శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః

పిల్లలకు సంబంధించిన ధర్మ సందేహాలు

పూజ్య గురువులకు జయము జయము

మన గురుదేవులు తమ తపః ఫలితంగా పద్దెనిమిది పురాణములపై పూర్తి జ్ఞానముతో, ధర్మ సూక్షములను పరిగణనలోకి తీసుకొని ఎందరికో ఉపయోగపడేవి అయినవి, అడగలేక వీలు కాని ప్రశ్నలకు కూడా నేటి జనాచారాలతో సంబంధం లేకుండా కరాఖండిగా ధర్మ సందేహాలకు సమాధానములు ఇవ్వటం విదితమే.

చిన్నపిల్లలకు సైతం మన పురాణాలపై, మన వ్యాకరణంపై, మన సంస్కృతిపై ఆసక్తి కలిగేలా చేసి, విలువైన వైదిక సంపదను భవిష్యత్తు తరములకు అందించాల్సిన బాధ్యత మనందరిది.

నిష్కల్మషమైన పిల్లల మనసులో ఉండే ధర్మ సందేహాలు తీర్చటం మన బాధ్యత. ఈ సారి గురుదేవులు అవ్యాజమైన కరుణతో మనకు ఆ అవకాశం కల్పించారు. మీ పిల్లల యొక్క మరియు మీ పిల్లలకు సంబంధించిన ధర్మసందేహాలను ఈ క్రింది లంకె లోని దరఖాస్తు నింపడము ద్వారా మాకు పంపవచ్చును. ఈ దరఖాస్తు కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని గమనించగలరు.

మాకు అందిన అన్ని సందేహాలలో పలు మార్లు అడగబడిన ప్రశ్నలు తీసివేయగా, సమయాభావమును బట్టి ముఖ్యమైన ప్రశ్నలుగా భావించినవాటిని ఎన్నుకొని గురుదేవుల ద్వారా తప్పక నివృత్తి చేయగలము