Sri Vaddiparti Padmakar

Brahmasri Vaddiparti Padmakar garu

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

పేరు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

తల్లిదండ్రులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి చలపతిరావు గార్లు , శ్రీమతి శేషమణి గారు

అష్టావధానాలు 1224 పూర్తి చేశారు

శతావధానాలు 11

1.ఏలూరు, 2.విశాఖపట్నం, 3.తాడేపల్లిగూడెం, 4.చల్లపల్లి, 5.గుంటూరు, 6.రాజమండ్రి, 7.నరసరావుపేట, 8.హైదరాబాదు, 9.సికింద్రాబాద్, 10.హైదరాబాదు, 11.సికింద్రాబాదు

జంట అవధానాలు 8

శ్రీ కొండేపి మురళీ కృష్ణ గారితో కలిసి 6  మరియు  శ్రీ శ్రీచరణ్ పాలడుగు గారితో 2

త్రిభాషా మహాసహస్రావధానం :

హిందీ అవధానం : సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ఆగ్రాలో హిందీలో అవధానం చేసి ప్రముఖులప్రశంసలు పొందిన ఏకైక త్రిభాషా మహాసహస్రావధానిఏలూరులో ఆంధ్రహిందీసంస్కృతభాషలలో చేశారు.

ప్రత్యేకత : 756 పద్యాలు కదలకుండా 207 ని॥లలో (3గం॥27 ని ॥లలోధారణ చేసిన ఏకైకసహస్రావధాని.

మరొక ప్రత్యేకత : భారతభాగవతరామాయణాలే కాక అష్టాదశ పురాణాలను ఉపన్యసించిఅంబికావారి ఆస్థాన పౌరాణికునిగా నియమితులైన ఏకైక సహస్రావధాని.

అత్యద్బుతధారణ : భాగవతంలోని వేలాది పద్యాలుప్రాచీన కావ్యాలలోని వేలాది పద్యాలుఆసువుగా చెప్పగలరు.

బిరుదులు : 1.అభినవశుక, 2.ఆంధ్రమురారి, 3.ఆంధ్రభాషా భూషణ, 4.సరస్వతీపుత్ర, 5.కవిరాజశేఖర, 6.అవధానకోకిల 7.ధారణాచిత్రగుప్త (జొన్నవిత్తుల వారు ఇచ్చారు), 8.భాగవత కళ్యాణకృష్ణ, 9.పంచామృత ప్రవచక 10.సహస్రపద్మ 11.పౌరాణిక సార్వభౌమ, 12.ధారణా వేదావధాననిధి(శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఇచ్చారు)

భాగవతసప్తాహ ప్రత్యేకత : ఆంధ్రకర్ణాటకఉత్తరప్రదేశ్బీహార్మధ్యప్రదేశ్కేరళ,తమిళనాడులోనునైమిశారణ్యముశుకస్థల్బృందావనాది పుణ్యక్షేత్రాలలోను భాగవత సప్తాహాలుచేశారుభాగవతం మొత్తం పుస్తకం లేకుండా ప్రవచనం చేయగలిగిన ఏకైక సహస్రావధానివింధ్యాచలంలో దేవీభాగవత నావాహ ప్రవచనాలు చేసినారు.

సమర్థ సద్గురత్వము : దాదాపు 1,00,000 మందికి పైగా మంత్రోపదేశాలు చేసి వారిని ఆధ్యాత్మికమార్గంలో నడుపుతూ ప్రణవ పీఠం స్థాపించి శిష్యుల చేత ‘సమర్థ సద్గురు’ బిరుదు పొందిన అవధాని.

సన్మానాలు : 1.పల్లకీ ఊరెరిగింపు (ఏలూరు) 2.హెలికాప్టర్ అధిరోహణ 3.సువర్ణ కంకణధారణ4.రథారోహణబృందావనంఆగ్రా జిల్లాఉత్తరప్రదేశ్ఇవి కాక అసంఖ్యాకంగా ప్రజా సత్కారాలు5.ఏలూరులో గజారోహణ మరియు గండపెండేర సత్కారాలు.

రచనలు : 1.కలకింకిణులు(ముద్రితం) 2.శ్రీ సత్యసాయి సప్తశతి(ముద్రితం), 3.శ్రీనీలకంఠేశ్వర శతకం(ముద్రితం), 4.హనుమన్మహిమ(అముద్రితం) 750 పద్యాల ఖండ కావ్యం, ‘మానవకథ’ పద్యకావ్యంఇంకా పలు కథలువ్యాసాలు.

రూపకాలు : వందలాది రూపకాలు నిర్వహించారుభువన విజయంలో తెనాలి రామకృష్ణఅవధానివిజయంలో  చెళ్ళపిళ్ళసుధర్మా సభలో నారద పాత్రలు ప్రత్యేకాలు.

ఆశు కవితలో ప్రత్యేక : 90 ని॥లలో 180 పద్యాలు ఆశువుగా చెప్పుట.

పాదయాత్రా ధురీణత : వేలాది భక్తులతో ఆంధ్రాలోని ప్రముఖ దేవాలయాలకు పాదయాత్రచేయించుటద్వారకాతిరుమలవిజయవాడ కనకదుర్గ ఆలయం మున్నగునవి.

పీఠాధిపతుల సత్కారాలు : 1. శృంగేరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు 2.శ్రీసత్యసాయిబాబా 3..శ్రీగణపతి సచ్చిదానందస్వామిజీ, 4.శ్రీవిశ్వయోగి విశ్వంజీ,5. శ్రీవాడేకర్మహారాజ్ వంటి ప్రముఖ పీఠాధిపతుల సత్కారాలు పొందారు.

ఆస్థాన విద్వాంసులు : 2003సం॥ మే నెల నుండి అవధూత దత్తపీఠము మైసూర్ వారి ఆస్థానవిద్వాంసులుగా నియమింపబడిరి.

విదేశీ పర్యటనలు : పురాణ ప్రవచనాలుసాహిత్యోపన్యాసాలుఅవధానాల  నిమిత్తం   సం॥ 2006 నుండి ప్రతి సంవత్సరము ఏప్రిల్మే నెలలో అమెరీకా లో ఉన్న కొన్ని ముఖ్యమైన పట్టణాలలోపర్యటిస్తుంటారు.

సింగపూర్ లో ది.29-04-2006 నుండి ది.05-05-2006 వరకు అవధానాలుప్రవచనాలు చేశారు.దుబాయిలో ది.01-04-2008 నుండి ది.06-04-2008 వరకు పంచాంగ ప్రవచనాలు,పురాణ ప్రవచనాలు చేసారు 

 

Song Image